త‌మిళ‌నాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు పునః ప్రారంభం

సీఎం దళపతి విజయ్ చారిత్రాత్మక నిర్ణయం

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏళ్ల తరబడి అగ్ర నాయకులు సాధించలేని దానిని ముఖ్యమంత్రి స్వీకరించిన వెంటనే సాధించి చూపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన జ‌య‌ల‌లిత అమ్మ క్యాంటీన్ల‌ను పున‌రుద్ద‌రించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి ఆధునీకరించాలని విజయ్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పని చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఉనవగంలో నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం స్ప‌ష్టం చేశారు. నాసిరకం ఆహారం అందిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పునరుద్ధరణ , సదుపాయాల కోసం నిధులను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ నిధుల నుండి విడుదల చేస్తామ‌ని వెల్ల‌డించారు.

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 383 అమ్మ ఉనవగంగాలను నడుపుతుండగా, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 237 అటువంటి కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 383 అమ్మ ఉనవగమ్‌లను నడుపుతుండగా, ఇతర కార్పొరేషన్లు , మునిసిపాలిటీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 237 అటువంటి కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూసేందుకు అమ్మ ఉనవగమ్‌ను పునరుద్ధరించాలని, ఆధునీకరించాలని స్ప‌ష్టం చేశారు. ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండేందుకు వీలు లేద‌న్నారు విజ‌య్.
అంతే కాకుండా మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని, ఆహార తయారీకి నాణ్యమైన సామగ్రిని సేకరించాలని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా సైదాపేటలో ప్రయోగాత్మక అమలు అనంతరం 2013లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ, గత కొన్నేళ్లుగా దీనిపై అవసరమైనంత శ్రద్ధ పెట్టలేదు అని ఏఐఏడీఎంకేకు చెందిన చెన్నై మాజీ మేయర్ సైదాయి దురైస్వామి అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!