ఐపీఎల్ టైటిల్ 2026 వేట‌లో నాలుగు జ‌ట్లు

గుజ‌రాత్, రాజ‌స్తాన్ , హైద‌రాబాద్ , బెంగ‌ళూరు

హైద‌రాబాద్ : అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. టోర్నీలో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన‌గా చివ‌ర‌కు 4 జట్లు టైటిల్ పోరులో నిలిచాయి. ఇక టోర్నీలో భాగంగా త‌ల‌ప‌డిన ఆరు జ‌ట్లు ఇంటి బాట పట్టాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అనుకున్న‌ట్టే ఆ కీల‌క‌మైన నాలుగు టీమ్ లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. వాటిలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ , రియాన్ పరాగ్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పాట్ కమిన్స్ నేతృత్వంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో పాటు ర‌జిత్ పాటిదార్ కెప్టెన్సీ లోని మాజీ డిఫెడింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ‌రిలో నిలిచాయి. ఎలిమినేట‌ర్స్ మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నుంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్.

అంద‌రూ ఈసారి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ లోకి వ‌స్తుంద‌ని భావించారు ఫ్యాన్స్. కానీ ఆశించిన మేర ఆడ‌లేక పోయింది. ఇక ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది అక్ష‌ర్ ప‌టేల్ కెప్టెన్సీ లోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఐపీఎల్ టోర్నీలో లీగ్ ద‌శ‌లో ఆఖ‌రి మ్యాచ్ ల‌లో అద్భుతంగా ఆడాయి రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఆ జట్లు వ‌రుస‌గా ముంబై ఇండియ‌న్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను ఓడించాయి. ఇక ఈసారి రిష‌బ్ పంత్ తీవ్ర నిరాశ ప‌రిచాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ఇంటి బాట ప‌ట్టింది. మొత్తంగా టైటిల్ ఫెవరేట్స్ గా గుజ‌రాత్, హైద‌రాబాద్ , బెంగ‌ళూరు ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!