#Tirumala : తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ

క‌రోనా త‌గ్గుముఖం స్వామి కోసం క్యూ

Tirumala : తిరుమ‌ల‌లో కొలువైన వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మల‌ను ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు క్యూ క‌ట్టారు. ఓ వైపు క‌రోనా భ‌యం ఉన్నా ప‌ట్టించు కోవ‌డం లేదు. స్వామిని న‌మ్ముకుంటే ఏమీ కాద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఏపీ, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.

తిరుమ‌ల తిరుప‌తి  దేవస్థానం(Tirumala) భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏర్పాట్లు చేసింది. దీంతో భ‌క్తుల ర‌ద్దీ గ‌ణీనీయంగా పెరిగింది. ఏడు కొండ‌ల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. ఇటీవ‌లి కాలంలో 40 వేల‌కు మించ లేదు. ఒక్క గురువారం రోజు 41 వేల 442 మంది భ‌క్తులు శ్రీ స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

దీంతో పెద్ద ఎత్తున విరాళాలు, కానుక‌లు స‌మ‌ర్పించారు. తిరుమ‌ల(Tirumala) ఆల‌య హుండీ ఆదాయం 2 కోట్ల 99 ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఇక శ్రీ‌వారిని ద‌ర్శించుకొని 18 వేల 161 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని పేర్కొంది. ఇదిలా ఉండగా 300 రూపాయ‌ల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, అద్దె గ‌దుల టికెట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్ లైన్ లో విడుద‌ల చేసింది.

సుదూర ప్రాంతాల‌లో ఉన్న భ‌క్తుల‌కు ఈ సౌక‌ర్యం క‌ల్పించింది. గ‌త ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన 10 వేలు క‌డితే వీఐపీ ద‌ర్శ‌నం టికెట్ల‌కు భారీ స్పంద‌న ల‌భిస్తోంది. భ‌క్తుల‌కు ఎప్ప‌టి లాగానే అన్న‌దానంతో పాటు ప్ర‌సాదాన్ని అంద ‌జేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది.

 

No comment allowed please