కేరళ : కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం వామపక్ష పార్టీ సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ ఇండియన్ జర్నలిస్టు ప్రణయ్ రాయ్ తో చిట్ చాట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన అంశాల గురించచి తను పంచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్యం, ఉపాధికి , మహిళా సాధికారతకు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కేరళ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు. కానీ ఆ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ , మోదీ, అమిత్ షా ఒప్పుకోరని అన్నారు.
అందరూ అనుకున్నట్లు కులం పేరుతో, మతం పేరుతో చిల్లర రాజకీయాలు అంటూ ఉండవన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజం, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు పినరయ్ విజయన్. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా, అక్కచెల్లెల్లా జీవిస్తారని అన్నారు. కేరళ ఎప్పటినుంచో భారతదేశం లోని లౌకికవాదానికి బలమైన ఉదాహరణలలో ఒకటిగా పరిగణించ బడుతోందని చెప్పారు సీఎం. ఇక్కడ పండుగలు, విశ్వాసం, దైనందిన జీవితం తరచుగా మతపరమైన హద్దులను దాటి ఉంటాయన్నారు. ఈ సంభాషణలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ ఆలోచనను ప్రతిబింబిస్తూ, కేరళ సామాజిక నిర్మాణం సామరస్యం, ఉమ్మడి సంప్రదాయాలలో ఎంత లోతుగా పాతుకు పోయిందో హైలైట్ చేశారు. అదే సమయంలో ఈ సమతుల్యతను సవాలు చేయాలని చూసే శక్తులు ఉన్నాయని ఆయన అంగీకరించారు.
