చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఆయన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నారు నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు. అత్యంత సామాన్యుడిగా వ్యవహరిస్తున్నారు . ఓ వైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాను ప్రజల మనిషినని జోసెఫ్ విజయ్ చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన మణిరత్నం గతంలో తీసిన నాయక్ మూవీని తలపించేలా చేస్తున్నాడు. ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని ప్రకటించాడు. ‘నాయక్’ సినిమాలో అనిల్ కపూర్ లాగే విజయ్ కూడా వరుసగా నిర్ణయాలు తీసుకుంటుండడం చర్చకు దారితీసేలా చేసింది సినీ పరిశ్రమ రంగంలో.
టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్ర ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని స్వయంగా ప్రకటించారు. ఎవరైనా సరే తనతో నేరుగా కలవవచ్చని, ఎక్కడా అధికార దర్పం అనేది ఉండదన్నారు. ఎవరైనా అలా పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. . ట్రాఫిక్‌లో ఎవరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఉండదని నొక్కి చెప్పారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరికీ రోడ్‌బ్లాక్‌లు ఉండవన్నారు. ఇక నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా తమ సర్కార్ నిర్ణయం తీసుకోబోదన్నారు. అందుకే ప్రజలు ఆయన్ని ఒక విభిన్నమైన నాయకుడిగా పరిగణిస్తున్నారు. సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యలు, నిరాడంబరత, సూటి నిర్ణయాల వల్ల ఆయన ఆరా నిరంతరం పెరుగుతోంది .తమిళనాడు ప్రజలకు ఇప్పుడు నిజంగా ఆ ‘నాయక్’ సినిమా వైబ్ రావడం మొదలైంది.