Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ

ట్ర‌క్కు డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాట్ టాపిక్ గా మారారు. మంగ‌ళ‌వారం ఊహించ‌ని విధంగా ఆయ‌న లారీ ఎక్కారు. కార‌ణం దేశ వ్యాప్తంగా ట్ర‌క్కు డ్రైవ‌ర్లు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి నుంచి అభ్య‌ర్థ‌న రావ‌డంతో స్వ‌యంగా తానే లారీ ఎక్కారు. ప‌లువురు డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు, ఇబ్బందుల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు రాహుల్ గాంధీ.

లారీ డ్రైవ‌ర్ తో పాటు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఇవాళ చండీగ‌ఢ్ వ‌ర‌కు ప్ర‌యాణించారు. భార‌త దేశంలోని జాతీయ ర‌హ‌దారులు, ఇత‌ర రోడ్ల‌పై దాదాపు 90 ల‌క్ష‌ల మంది ట్ర‌క్కు డ్రైవ‌ర్లు నిత్యం ప్ర‌యాణం చేస్తుంటార‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ. వారికి ఉద్యోగ భ‌ద్ర‌త అనేది ఉండ‌ద‌న్నారు. వారు ప్ర‌మాదాల‌కు గురైనా లేదా ప్ర‌మాద‌వశాత్తు చ‌ని పోయినా ప‌ట్టించుకునే వారు లేర‌ని, వారికి ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి సాయం అంద‌డం లేద‌ని వాపోయారు రాహుల్ గాంధీ.

ఇవాళ ముర్త‌ల్ నుంచి అంబాలా వ‌ర‌కు ట్ర‌క్కులో ఆయ‌న ప్ర‌యాణించారు. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. రాహుల్ గాంధీ 11 గంట‌ల స‌మ‌యంలో ముర్త‌ల్ కు చేరుకున్నారు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో ట‌క్కు ఎక్కి అంబాలాకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని సిమ్లా వైపు వెళ్లారు. కాగా రాహుల్ గాంధీ అర్ధ‌రాత్రి ప్ర‌యాణంపై పార్టీ నాయ‌క‌త్వం పెద‌వి విప్ప‌లేదు.

Also Read : Samrat Chaudhary

Leave A Reply

Your Email Id will not be published!