వైభ‌వ్ విధ్వంసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

ప్లే ఆఫ్స్ రేసులో రియాన్ ప‌రాగ్ సేన ముందంజ

జైపూర్ : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ల‌క్నో సూపర్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ రూల్స్ అతిక్ర‌మించ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు వేశారు. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ల‌క్న జ‌ట్టు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం భారీ టార్గెట్ ను అల‌వోక‌గా ఛేదించింది. ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, వండ‌ర్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. ప్ర‌ధానంగా వైభ‌వ్ సూర్య వంశీ చుక్క‌లు చూపించాడు. విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో బెంబేలెత్తించాడు. దీంతో స్వంత గ‌డ్డ‌పై రాజ‌స్థాన్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వ‌రుస‌లో నిలిచింది.

ఇక వైభ‌వ్ సూర్య వంశీ కేవ‌లం 38 బంతులు మాత్ర‌మే ఆడి 7 ఫోర్లు 10 సిక్స‌ర్లతో విరుచుకుప‌డ్డాడు. 93 ప‌రుగులు చేశాడు. ఇక చివ‌రి మ్యాచ్ లో గెలిచి ప‌రువు ద‌క్కించు కోవాల‌ని అనుకున్న ల‌క్నో ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. 221 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది. జైశ్వాల్ , ధ్రువ్ జురైల్ కూడా జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. ధ్రువ్ జురైల్ 38 బంతులు ఆడి 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 53 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిల‌వ‌గా జైస్వాల్ 43 ప‌రుగులు చేశాడు. అంత‌కు ముందు ల‌క్నో జ‌ట్టులో మిచెల్ మార్ష్ 57 బంతు్లో 11 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 96 ప‌రుగులు చేశాడు. జోస్ ఇంగ్లిష్ 29 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స‌ర్లో 60 ప‌రుగులు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!