ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్ లో బాబర్..బౌల్ట్ టాప్
మరింత దూసుకు వెళ్లిన పంత్..పాండ్యా
ICC ODI Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ర్యాంకింగ్స్(ICC ODI Rankings) డిక్లేర్ చేసింది. ఇక ఇంగ్లండ్ టూర్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించడమే కాకుండా సీరీస్ నెగ్గేందుకు కారణమైన రిషబ్ పంత్ తన ర్యాంకును మెరుగు పర్చుకున్నాడు.
బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 52 వ స్థానానికి పంత్ చేరుకోగా ఇదే టీమ్ పై అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా 8 స్థానాలు దాటుకుని 42వ ప్లేస్ తో సరిపెట్టుకున్నాడు.
బౌలింగ్ భాగంలోనూ హార్దిక్ 70వ స్థానానికి చేరుకున్నాడు. ఇక తొలి వన్డేలో సూపర్ బౌలింగ్ స్పెల్ తో ఆకట్టుకున్న జస్ ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ ప్లేస్ నుంచి రెండో స్థానానికి పడి పోయాడు.
ఇక ఎప్పటి లాగానే పరుగల్ని అలవోకగా తీస్తూ తనకు ఎదురే లేదంటూ ముందుకు సాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎప్పటి లాగే నెంబర్ వన్ లో ఉన్నాడు.
ఇమాముల్ హక్ ద్వితీయ స్థానంతో సరి పెట్టుకోగా డుసెన్ మూడో ప్లేస్ లో నిలిచాడు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సెంచరీ చేయకుండా తీవ్రమైన ఒత్తిళ్లతో నిరాశ పరుస్తూ వస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంతో ఉన్నాడు.
రోహిత్ శర్మ 5వ ప్లేస్ లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో చూస్తే బౌల్ట్ నెంబర్ వన్ లో నిలిచాడు. బుమ్రా సెకండ్ , షాహిన్ అఫ్రిది మూడో స్థానంలో ఉండడం విశేషం.
ఇక ఆల్ రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. నబీ, రషీద్ ఖాన్ తర్వాతి ప్లేస్ లో నిలిచారు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం 8వ స్థానంలో నిలిచాడు.
Also Read : రోహిత్ తర్వాత పంత్ కే కెప్టెన్సీ