Sanju Samson : శాంసన్ పై కక్ష బీసీసీఐ వివక్ష
స్టాండ్ బై ఆటగాడిగా కూడా పనికి రాడా
Sanju Samson : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి కేరళ స్టార్ సంజూ శాంసన్ పై వివక్ష ప్రదర్శించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆడే భారత జట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ముంబై క్రికెటర్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది.
కానీ ఆస్ట్రేలియాపై అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన సంజూ శాంసన్(Sanju Samson) ను పూర్తిగా పక్కన పెట్టేసింది. కేవలం ముంబై ఆటగాళ్లకు ప్రయారిటీ ఇస్తూ వస్తుందన్న విమర్శలకు తావిచ్చేలా నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బీసీసీఐ అనేది భారతీయ జనతా పార్టీ ఆఫీసుగా మారి పోయింది. క్రీడా సంస్థగా కంటే రాజకీయ సంస్థగా తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐకి బాస్ గా బిన్నీ ఉన్నా మొత్తం చక్రం తిప్పేదంతా జే షానే. ఆయన హోం మంత్రి అమిత్ షా తనయుడు.
సంజూ శాంసన్ ఎంపిక చేయక పోవడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Sashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే కొందరికేనా మిగతా వాళ్లకు ఛాన్స్ ఇవ్వరా అంటూ నిప్పులు చెరిగారు. వరుసగా వైఫల్యం చెందినా సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేస్తూ వచ్చింది. తాజాగా ఎంపిక చేసిన జట్టులో స్టాండ్ బై ఆటగాళ్లలో అతడిని చేర్చింది. ఏది ఏమైనా ప్రతిభా నైపుణ్యం కలిగిన శాంసన్ ను పక్కన పెట్టడం బాధాకరం.
Also Read : రెచ్చి పోయిన ఆండ్రూ రస్సెల్