టెస్లా చైర్మన్, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో అత్యధిక ధనవంతుడిగా పేరు పొందారు. అయినా సామాన్యుడిగానే ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కేవలం ఓ చిన్న ప్లాట్ లో ఉంటున్నాడు మస్క్. ఇప్పటికే ట్విట్టర్ ను భారీ ధరకు కొనుగోలు చేశాడు. ఏకంగా రూ. 4,400 కోట్లకు చేజిక్కించుకున్నాక కీలక మార్పులు చేశాడు.
తాజాగా తను స్థాపించిన టెస్లా కంపెనీకి సంబంధించి కీలక ప్రకటన చేశాడు. తన ఆమోదం పొందే వరకు ఎవరూ టెస్లాలో చేరలేదరన్నాడు. మస్క్ ఎగ్జిక్యూటివ్ లకు వారానికి ఒకసారి నియామక అభ్యర్థనల జాబితాను పంపమని కోరాడు. అదే సమయంలో అటువంటి అభ్యర్థనలను సమర్పించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హెచ్చరించాడు ఎలాన్ మస్క్. వ్యక్తిగతంగా వారిని ఆమోదిస్తే తప్ప కొత్త నియామకాలు లేవని స్పష్టం చేశాడు. కాంట్రాక్టర్లతో సహా వ్యక్తిగతంగా వారిని ఆమోదించే వరకు కంపెనీ కొత్త నియామకాలు చేపట్టదని పేర్కొంది.
మీరు నా ఇమెయిల్ ఆమోదం పొందే వరకు ఎవరూ కాంట్రాక్టర్ గా కూడా టెస్లాలో చేరలేరని హెచ్చరించారు. ఈ మేరకు అందరికీ ఇ మెయిల్స్ రూపంలో స్పష్టం చేశాడు. గత నెలలో కంపెనీలో రెండు ఏళ్లలో కనిష్ట త్రైమాసిక స్థూల మార్జిన్ ను నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను కోల్పోయింది. ఎందుకంటే డిమాండ్ ను పెంచేందుకు,పెరుగుతున్న పోటీని నివారించేందుకు యుఎస్, చైనాతో సహా మార్కెట్ లలో ధరలను దూకుడుగా తగ్గించింది.
