Samrat Chaudhary : ప్రజల డబ్బులతో నితీశ్ విహార యాత్ర
ఆయన ఎన్నటికీ ప్రధాని కాలేడు
Samrat Chaudhary : బీహార్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సామ్రాట్ చౌదరి(Samrat Chaudhary) నిప్పులు చెరిగారు. ఆయన జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విపక్షాలను కలిసే నెపంతో దేశ వ్యాప్తంగా నితీశ్ కుమార్ విహార యాత్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన చేస్తున్న ప్రయాణం ఖర్చంతా ప్రజలదేనని ఆ విషయం గుర్తుంచు కోవాలన్నారు. బీహార్ సీఎం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు సామ్రాట్ చౌదరి.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నటికీ దేశానికి ప్రధానమంత్రి కాలేడని ఎద్దేవా చేశారు బీజేపీ చీఫ్. ఆయనను ఏ పార్టీ ఒప్పుకోదన్నారు. విపక్ష నేతలను కలవడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నాడు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్రాన్ని పాలించాల్సిన సీఎం పనిగట్టుకుని విపక్షాలను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బీజేపీ చీఫ్.
ఇదిలా ఉండగా నితీశ్ కుమార్ విపక్షాలను కలిపేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు.
Also Read : Smriti Irani
