Byjus Faces : బైజూస్ పై వ‌డ్డీ చెల్లింపుల భారం

Byjus Faces : భార‌త దేశంలో అత్యంత విలువైన స్టార్ట‌ప్ (అంకురాలు)ల‌లో ఒక‌టైన బైజూస్(Byjus) ఏకంగా $40 మిలియ‌న్ల‌ను కేవ‌లం వ‌డ్డీ రూపేణా చెల్లించాల‌ని చూస్తోంది. $1.2 బిలియ‌న్ల రుణం ఒక స్టార్ట‌ప్ ద్వారా ఎన్న‌డూ లేని అతి పెద్ద రుణం కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ బైజూ సంస్థ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డింది. ప్ర‌స్తుతం బైజూస్ ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు కేంద్రంగా ఉంది.

ఇందుకు సంబంధించి బైజూ ఇంకా స్పందించ లేదు. రుణంపై స‌ల‌హా ఇచ్చేందుకు రుణ దాత‌లు నియ‌మించిన హౌలిహాన్ లోకి ఇంక్ ప్ర‌తినిధులు వ్యాఖ్యానించేందుకు నిరాక‌రించారు. బైజూస్ రుణం స్టార్ట‌ప్ ద్వారా ఎన్న‌డూ లేని అతి పెద్ద రుణం. ఒక‌ప్పుడు మాజీ టీచ‌ర్ త‌న‌యుడు బైజు ర‌వీంద్ర‌న్ నేతృత్వంలో విద్యా సంస్థ ఏర్పాటు చేశారు. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చింది.

దేశంలోనే కంటెంట్ క్రియేష‌న్ విష‌యంలో కీల‌క‌మైన సంస్థ‌గా మారింది బైజూస్. ఇప్ప‌టికే సంస్థ‌కు సంబంధించి రుణాలు పొందింది. మ‌రో వైపు రుణ దాత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఆన్ లైన్ ట్యూట‌రింగ్ విష‌యంలో కొంత ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా బైజూస్ తీవ్ర న‌ష్టాల్లోకి నెట్టి వేయ‌బ‌డింది. దీంతో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా మారేలా చేసింది.

తాజాగా బ్లూమ్ బెర్గ్ డేటా ప్ర‌కారం సెప్టెంబ‌ర్ లో డాల‌ర్ కు రికార్డు స్థాయిలో 64.5 సెంట్లు ప‌డి పోయిన రుణం దాదాపు 78 సెంట్ల వ‌ద్ద ఉంది. బైజూస్ మార్చి 31 వ‌ర‌కు ఆర్థిక ఖాతాల‌ను దాఖ‌లు చేసేందుకు గ‌డువును కోల్పోయింది. దేశం విదేశీ మార‌క‌పు విధానాల ఉల్లంఘ‌న‌ల‌ను ప‌రిశోధించే ఏజెన్సీ బైజూస్ ఆఫీసుల‌ను సోదాలు చేసింది.

Also Read : Tata To Bulid : రూ. 13 వేల కోట్ల‌తో టాటా ఈవీ ప్లాంట్

 

Leave A Reply

Your Email Id will not be published!