Steve Smith Record : స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డ్

టెస్టు కెరీర్ లో 31వ సెంచ‌రీ

Steve Smith Record : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. త‌న జ‌ట్టుకు బ‌ల‌మైన స్కోరు అందించ‌డంలో దోహ‌ద ప‌డ్డాడు. ఓ వైపు హేడ్ మ‌రో వైపు స్మిత్ భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. భారీ స్కోర్ సాధించే దిశ‌గా ప‌రుగులు తీస్తోంది ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా జ‌ట్టు. నిన్న‌టి ఓవ‌ర్ నైట్ స్కోర్ 95 ప‌రుగుల‌తో మైదానంలోకి వ‌చ్చిన స్టీవ్ స్మిత్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

త‌న టెస్టు కెరీర్ లో ఇది స్మిత్ కు 31 వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ సెంచ‌రీతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు చేసిన భార‌త మాజీ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ ను దాటేశాడు. ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం 28 సెంచ‌రీల‌తో ఉన్నాడు. కాగా రెండో రోజు ఆట‌లో పేస‌ర్ సిరాజ్ కు షాక్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ ఫోర్ల‌తో శ‌త‌కం పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా త‌ర‌పున ఇంగ్లండ్ లో త‌న ఏడో టెస్టు సెంచ‌రీ చేశాడు స్టీవ్ స్మిత్.

ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో అనేక రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. ఇంగ్లండ్ లో రెండో అత్య‌ధిక టెస్టు సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా ద్ర‌విడ్ ను దాటేశాడు. ఇంగ్లండ్ లో స్టీవ్ స్మిత్, స్టీవ్ వా ఇద్ద‌రూ ఏడు సెంచ‌రీలు చేయ‌డం విశేషం. 11 సెంచ‌రీలు చేసిన డాన్ బ్రాడ్ మ‌న్ త‌ర్వాత స్మిత్ మాత్ర‌మే నిలిచాడు.

Also Read : Ramayana Alia Bhatt : రామాయ‌ణంలో సీతగా అలియా భ‌ట్

Leave A Reply

Your Email Id will not be published!