Amit Shah PM Modi : యావత్ ప్రపంచం మోదీ జపం – షా
ఆయన దేశానికి చెందిన నాయకుడు
Amit Shah PM Modi : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం మోదీ జపం చేస్తోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మోదీ పాలన 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ గత నెల మే 30 నుంచి జూన్ 30 వరకు ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ చేపట్టింది. ఈ సందర్భంగా పాల్గొన్న అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. తాము నిధులు ఇస్తుంటే రాష్ట్రం తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందంటూ మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పంచుతున్న బియ్యం ప్రధాని మోదీ(PM Modi) ఇచ్చినవేనని పేర్కొన్నారు. కేంద్రం బియ్యం ఇస్తుంటే రాష్ట్రం జగన్ ఫోటో ఎలా వేసుకుంటారంటూ అమిత్ షా నిప్పులు చెరిగారు.
త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వైసీపీ మరోసారి పవర్ లోకి రావాలని సంక్షేమ పథకాలతో హోరెత్తిస్తోంది. ఇక టీడీపీ జనంలో పాదయాత్ర చేపడుతోంది. జనసేన ,బీజేపీ కార్యరంగంలోకి దూకాయి. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఏపీలో పాగా వేయాలని చూస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇప్పటికే ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వరుసగా ఏపీలో సభలు నిర్వహిస్తూ రాజకీయ వేడిని రగిలించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
Also Read : L Sivaramakrishnan : షాతో శివరామకృష్ణన్ భేటీ
