Rahul Gandhi : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – రాహుల్

ప్ర‌తి నెలా రూ. 4 వేల పెన్ష‌న్ సౌక‌ర్యం

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ ను, భార‌త రాష్ట్ర స‌మితి పార్టీపై నిప్పులు చెరిగారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా ప‌ని చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఏ పార్టీ కేసీఆర్ ను న‌మ్మ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. తాము కూడా దూరంగా పెట్టామ‌ని చెప్పారు. ఆదివారం ఖ‌మ్మంలో కాంగ్రెస్(Congress) పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌కు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. రాష్ట్రంలో స్కీంలు, స్కాంలు , క‌మీష‌న్లు త‌ప్ప ఈ పాల‌న‌లో ఇంకేమీ లేద‌న్నారు.

ఇప్ప‌టికే నిరుద్యోగులు, రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని కానీ ఒక్క‌రినీ కూడా ఆదుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌ర్ణాట‌క‌లో బీజేపీ స‌ర్కార్ కు మంగ‌ళం పాడార‌ని , ఇప్పుడు తెలంగాణ‌లో కూడా బీఆర్ఎస్ ను సాగనంపాల‌ని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వ‌స్తే వృద్దులు, వితంతువుల‌కు నెల‌కు రూ. 4,000 పెన్ష‌న్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇప్ప‌టికే త‌మ పార్టీ వ‌రంగ‌ల్ లో రైతుల‌కు , హైద‌రాబాద్ లో యూత్ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించామ‌ని తెలిపారు రాహుల్ గాంధీ. దేశ‌మంతా భార‌త్ జోడో యాత్ర‌ను స‌మ‌ర్థించింద‌ని , విద్వేషాన్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేశామ‌ని అన్నారు. అవినీతిలో కేసీఆర్ ను మించిన సీఎం ఎవ‌రూ లేర‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ల‌క్ష కోట్ల రూపాయ‌ల క‌ర‌ప్ష‌న్ చోటు చేసుకుంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Also Read : Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ ప‌త‌నం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!