TTD Chairman : వరలక్ష్మీ వ్రతం లోకం సుభిక్షం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలను ఇచ్చేలా అమ్మ వారు అనుగ్రహం ఇస్తారని చెప్పారు.
TTD Chairman Said
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతాన్ని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ పూజారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం టీటీడీ చైర్మన్(TTD Chairman) మీడియాతో మాట్లాడారు. శ్రీ మహాలక్ష్మి అవతరించిన దివ్యమైన స్థలం తిరుచానూరు అన్నారు. ఈ పవిత్ర నేలపై ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. వ్రతాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు, అన్న ప్రసాదాలు , ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.
Also Read : R Praggnanandhaa Comment : ఈ చిచ్చర పిడుగు చెస్ లో కింగ్
