Pawan Kalyan : హైదరాబాద్ – నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించి బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సభకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు నటుడు , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఆయనకు తన పక్కనే సీటు ఇచ్చారు. వరుసగా ఈటల రాజేందర్ , లక్ష్మన్ , గంగాపురం కిషన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ, పవన్ కళ్యాణ్ కొలువు తీరారు.
Pawan Kalyan Meet PM Modi
ఈ సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కొద్ది సేపు ముచ్చటించారు. బాగున్నావా అంటూ పలకరించారు. ఇదే సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు.
సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశంలో బీసీలకు అత్యధిక ప్రయారిటీ ఇస్తున్న ఏకైక పార్టీ బీజేపీనంటూ కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి పోటీ చేస్తోందంటూ పేర్కొన్నారు.
తమ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఉంటుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. దేశంలో ఇప్పటి దాకా ఏ పార్టీ కూడా బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించ లేదన్నారు. ఈ క్రెడిట్ కేవలం దమ్మున్న లీడర్ నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : Congress Slams : బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది
