నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు గోదావరి నీళ్లను తాకట్టు పెడుతున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని, ఏదో ఒక రోజు తెలంగాణ సమాజం నిలదీస్తుందని హెచ్చరించారు. ఇకనైనా సోయి తెచ్చుకుని రేవంత్ రెడ్డి పాలన సాగించాలని హితవు పలికారు జగదీశ్ రెడ్డి. ఇప్పుడు చంద్ర బాబు నాయుడు అక్రమ ప్రాజెక్ట్ లను ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించారు. బిజెపి నుంచి రక్షణ పొందడానికే ఈ చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.కేసులను కాపాడుకుందుకు కృష్ణ, గోదావరి జలాలను అప్పజెప్పుతున్నారంటూ ఆరోపించారు.
చంద్ర బాబు నాయుడు దయ దక్షణాల మీదనే ఈ ప్రభుత్వం బతుకుతోందన్నారు జగదీశ్ రెడ్డి. సోయిలేని ముఖ్యమంత్రి , మంత్రులు ఉండడం తెలంగాణకు శాపంగా మారిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపామన్నారు. నిద్ర మత్తులో ఏదో ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడని ఎద్దేవా చేశారు. లక్ష మందితో కేసీఆర్ గర్జన పెడితే సాగర్ మన ఆధీనంలో ఉంది అని ప్రకటన చేశారంటూ మండిపడ్డారు. మోడీనీ చూస్తే ఈ ప్రభుత్వానికి లాగు తడుస్తుందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్హాకం ఏందో తెలుసన్నారు. ముఖ్యమంత్రి , మంత్రులు వాటాల పంచాయతీ , ఢిల్లీకి మూటలు పంపించడతోనే సరి పోతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు జగదీశ్ రెడ్డి.
