అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆఖరి అంకానికి చేరుకుంది. 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో చివరగా కప్ కోసం రెండు జట్లు మిగాలాయి. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి ఇండియా, న్యూజిలాండ్. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేసింది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా అహ్మదాబాద్ కు క్యూ కట్టారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పోటీ పడ్డారు. ఇక భారత జట్టు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లో బలంగా ఉంది. మరో వైపు న్యూజిలాండ్ ఎలాంటి చప్పుడు చేయకుండానే పోటీకి సై అంటోంది.
ఆ జట్టు అత్యంత బలమైన, టోర్నీ ఫేవరేట్ గా ఉన్న దక్షిణాఫ్రికాను సెమీస్ లో 9 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్ ఊహించని రీతిలో క్వార్టర్ ఫైనల్ లో వెస్టిండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ 97 రన్స్ చేసి చివరి వరకు నిలిచాడు. ఇండియాను ఒంటి చేత్తో భారత్ ను సెమీస్ కు చేర్చాడు. ఇదే క్రమంలో ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ కీలక మ్యాచ్ లో సైతం సత్తా చాటాడు శాంసన్. 89 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. తనతో పాటు బుమ్రా , పాండ్యా , అక్షర్ పటేల్ , దూబే కీ రోల్స్ వహించారు. 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది భారత జట్టు.
