ముంబై : ప్రపంచ క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన సచిన్ రమేష్ టెండుల్కర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్. ఆయన జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన చిట్ చాట్ సందర్బంగా గతంలో సెలెక్షన్ కమిటీ సచిన్ విషయంలో కొనసాగించాలా లేదా అన్న విషయం అప్పట్లో పెద్ద రాద్దాంతం జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇదే సమయంలో తను గొప్ప క్రికెటర్ అని, ఆ విషయం గురించి కమిటీ సభ్యులు కూల్ గా మాట్లాడటం జరిగిందని చెప్పాడు సందీప్ పాటిల్. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ చివరి దశలో తన భవిష్యత్తు గురించి సెలక్షన్ కమిటీ నేరుగా మాట్లాడిందని వెల్లడించారు.
టెండూల్కర్ భవిష్యత్తు ప్రణాళికల గురించి సెలెక్టర్లు అడిగిన సూటి ప్రశ్నతో చర్చ ప్రారంభమైందని పాటిల్ అన్నారు. తాము అతనితో కూర్చున్నప్పుడు, నేను ఒక ప్రశ్న అడిగాను. ‘మీ ప్రణాళికలు ఏమిటి?’ అని..అందుకు సచిన్ టెండూల్కర్ తిరిగి ఎందుకు అని బదులు ఇచ్చాడు. ఎంపిక కమిటీ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోందని నేను అతనికి చెప్పాను. అతను ఆశ్చర్య పోయాడు. తరువాత అతను మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఈ విషయంలో ‘మీరు సీరియస్‌గా ఉన్నారా?’ అని అడిగాడు. నేను అవును అని చెప్పాను.”
సెలక్షన్ ప్యానెల్ టెండూల్కర్‌ను అధికారికంగా తొలగించలేదని లేదా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని ఎప్పుడూ అడగలేదని సందీప్ పాటిల్ స్పష్టం చేశాడు.సెలక్టర్లు ఒక ఆటగాడిని తొలగించవచ్చు. కానీ ఒక ఆటగాడి కెరీర్ ముగిసిందని సెలెక్టర్లు చెప్పలేరని అన్నాడు పాటిల్. తను కంటిన్యూ కావాలని కోరాడు. దానికి మేం అంగీకరించడం జరిగిందని చెప్పాడు.
