ఇరాన్ : అమెరికా ఏకపక్షంగా ఇజ్రాయెల్ పేరుతో ఇరాన్ పై దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు దేశ అధ్యక్షుడు చర్చలకు సిద్దం అంటూనే మరో వైపు దాడులకు పాల్పడడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే యుఎస్ ఆర్మీ చీఫ్ ను తొలగించారు. కొత్త వ్యక్తికి పగ్గాలు ఇచ్చారు ట్రంప్. ఈ క్రమంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే చర్చలకు రావాలని లేక పోతే పుట్టగతులు ఉండవంటూ పేర్కొన్నారు. అయినా ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేసింది ఇరాన్. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసింది. గడువుకు ముందు ట్రంప్ బెదిరింపులు తీవ్రతరం చేస్తుండగా, కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. దీంతో యుద్ద మేఘాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. ఇంకో వైపు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కట్టుగా చేస్తున్న దాడులకు కోలుకోలేని రీతిలో బదులు ఇస్తోంది. మరో వైపు చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి.
అయితే ఈ విపత్కర సమయంలో ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. చర్చలకు సిద్దమని ప్రకటించారు. కానీ ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. సంఘర్షణకు శాశ్వత ముగింపును డిమాండ్ చేసింది. ఆంక్షలను ఎత్తివేయడం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత మార్గం, పునర్నిర్మాణం వంటివి ఇరాన్ ప్రతిప్రాదించింది అమెరికాకు. మరో వైపు ఇవాల్టితో తాము ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుందని, ఇక పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయినా ట్రంప్ వార్నింగ్ ను లైట్ గా తీసుకుంది. జలసంధిని తిరిగి తెరవాలన్న ఒత్తిడిని కూడా అది తిరస్కరించింది. ఒప్పందం కుదుర్చు కోవడానికి మంగళవారం రాత్రి విధించిన గడువులోగా ఇరాన్ తన వాగ్దానాలను నెరవేర్చక పోతే, ఆ దేశం నామ రూపాలు లేకుండా చేస్తామన్నారు ట్రంప్.
