అమరావతి : నీతివంతమైన రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు . శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రసంగించారు సీఎం. నీతి, నిజాయితీలతో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్’ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నా సొంత కుటుంబం గురించి ఏ విధంగా ఆలోచిస్తానో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా అలాగే కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నానని తెలిపారు. పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తున్నది టీడీపీ అధినాయకత్వం. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు ముఖ్యమంత్రి. క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
జరుగుతున్న పరిణామాలను, ప్రత్యర్ధి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు. క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం… క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం, క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం అని చెప్పారు . పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని, పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలన్నారు.
