ముంబై : కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కానే కాదని స్పష్టం చేసింది సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం 2018 ఉత్తర్వును రద్దు చేసింది సీఐసీ అని పేర్కొంది. బీసీసీఐ ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో గానీ, లేదా ప్రభుత్వ నిధులతో గానీ నడపబడటం లేదు కాబట్టి దానిని ప్రభుత్వ సంస్థగా పరిగణించలేమని సమాచార కమిషనర్ పీఆర్ రమేష్ అన్నారు. చట్టంలోని సెక్షన్ 4 కింద సమాచారాన్ని చురుకుగా వెల్లడించాలని, ఆర్టీఐ దరఖాస్తుదారునికి పాయింట్ల వారీగా సమాధానాలు ఇవ్వాలని కూడా సీఐసీ బీసీసీఐని ఆదేశించింది. బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు, అందువల్ల పారదర్శకత చట్టం కింద ఎలాంటి ప్రశ్నలకూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత దానికి లేదని కేంద్ర సమాచార కమిషన్ సోమవారం స్పష్టం చేసింది.
ఈ విషయంలో తన సొంత 2018 ఉత్తర్వును రద్దు చేసింది. క్రికెట్ పరిపాలన, అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశ ప్రాతినిధ్యానికి సంబంధించిన ముఖ్యమైన ప్రజా విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో గానీ, లేదా ప్రభుత్వ నిధులతో నడపబడటం లేదు కాబట్టి దానిని ప్రభుత్వ సంస్థగా పరిగణించలేమని సమాచార కమిషనర్ నొక్కి చెప్పారు. సమాచార హక్కు (RTI) చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం BCCIని ‘ప్రజా అధికార సంస్థ’గా వర్గీకరించ లేమన్నారు. అందువల్ల ప్రస్తుత కేసు వాస్తవాలు , పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టంలోని నిబంధనలు దానికి వర్తించవు అని రమేష్ తన ఉత్తర్వులో వెల్లడించారు.
బీసీసీఐ ఏ నిబంధనలు, అధికారం కింద భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌ల కోసం ఆటగాళ్లను ఎంపిక చేస్తుందనే దానిపై సమాచారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను ఆయన కొట్టివేశారు.