BCCI IPL 2022 : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వేళ‌ల్లో మార్పు

ప్ర‌క‌టించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

BCCI IPL 2022 : ప్రపంచ క్రికెట్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన ఏకైక రిచ్ లీగ్ గా పేరొందింది ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్). 2008 లో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) టీ20 పొట్టి ఫార్మాట్ ను ప్రారంభించింది.

అప్ప‌ట్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌యోగించిన టీ20 ఫార్మాట్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ ఫార్మాట్ లో అత్య‌ధిక లాభాలు గ‌డిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే బీసీసీఐకి ఇది అక్ష‌య‌పాత్ర‌గా మారింది.

తాజాగా ముంబై వేదిక‌గా ఐపీఎల్ 2022(BCCI IPL 2022) మెగా టోర్నీ కొన‌సాగుతోంది. చివ‌రి అంకానికి చేరుకుంది. ప‌నిలో ప‌నిగా విమెన్స్ టీ20 ఛాలెంజ‌ర్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది ఈనెల 23 నుంచి.

ఇక పురుషుల ఐపీఎల్ వ‌ర‌కు వ‌చ్చే స‌రికి ఈనెల 29న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ కు రెండు జ‌ట్లు ఖ‌రార‌య్యాయి. ఒక‌టి గుజ‌రాత్ టైటాన్స్ కాగా రెండోది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ .

ఇక మూడు, నాలుగు స్థానాల‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ ప‌డుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఫైన‌ల్ మ్యాచ్ కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది బీసీసీఐ.

ఈ మేర‌కు టైమ్ ను మార్చిన‌ట్లు తెలిపింది. రాత్రి 7. 30 గంట‌ల‌కు ప్రారంభించాల్సిన ఈ మ్యాచ్ ను 8 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం.

సాయంత్రం 6.30 గంట‌ల నుంచి రాత్రి 7.30 గంట‌ల దాకా బాలీవుడ్ తార‌ల‌తో వినోద కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసింది బీసీసీఐ(BCCI IPL 2022). కోల్ క‌తా లోని ఫ‌స్ట్ క్వాలిఫయ‌ర్ , ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నుండ‌గా అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ కొన‌సాగ‌నుంది.

Also Read : ఎప్ప‌టికీ స‌రైన జోడి ద్ర‌విడ్ ఒక్క‌డే

Leave A Reply

Your Email Id will not be published!