Justcie NV Ramana : శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రమణ
స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ భూమన
Justcie NV Ramana : భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా కొత్తగా కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సాదర స్వాగతం పలికారు.
Justcie NV Ramana Visit Tirumala
ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు పూజారులతో పాటు టీటీడీ కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. దర్శన ఏర్పాట్లు చేశారు. మాజీ సీజేఐ దంపతులు శ్రీ వేంకటేశ్వర స్వామిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణకు(Justice NV Ramana) శ్రీవారి ప్రసాదాలను అందజేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల లోని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మహా ద్వారానికి నమస్కరించారు .
అంతకు ముందు జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుచానూరుకు వెళ్లారు. అక్కడ కొలువు తీరిన పద్మావతి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జేఈవో వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవింద రాజన్ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు .
Also Read : Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యేలు కుక్కలు – పల్లా
