Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యేలు కుక్క‌లు – ప‌ల్లా

ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్ రెడ్డి కామెంట్స్

Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ పార్టీ శాస‌న మండ‌లి స‌భ్యుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల‌తో పోల్చారు. ఆయ‌న చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నానంటూ పేర్కొన‌డం మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పించింది.

Palla Rajeshwar Reddy Comments Viral

తాను సీఎం కేసీఆర్ తో ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్రజా ప్ర‌తినిధుల‌ను బీఆర్ఎస్ లోకి ఎందుకు చేర్చుకుంటున్నారంటూ అడిగాన‌ని తెలిపారు. వాళ్లు రావ‌డం వ‌ల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌ని చెప్పాను.

దీనికి కేసీఆర్ ఆస‌క్తిక‌రమైన స‌మాధానం ఇచ్చార‌ని అన్నారు. ఎమ్మెల్యేలు కుక్క‌లు. ప్ర‌తిపక్షాల‌కు చెందిన వాళ్ల‌ను మ‌న పార్టీలోకి తీసుకుంటే ఇక ప్ర‌తిప‌క్షం అన్న‌ది ఉండ‌ద‌ని చెప్పారు. దీని వ‌ల్ల పార్టీకి మేలు చేకూరుతుంద‌ని తెలిపార‌న్నారు.

ఇత‌ర పార్టీలో ఉంటే మ‌న‌ల్ని టార్గెట్ చేస్తార‌ని, అదే ఆ కుక్క‌ల్ని మ‌న ఇంట్లో క‌ట్టి ప‌డేస్తే మ‌న వ‌ద్ద‌నే ఉంటార‌ని అన్నార‌ని గుర్తు చేశారు. మొత్తంగా ఎమ్మెల్యేల‌ను చివ‌ర‌కు కుక్క‌ల‌తో పోల్చే స్థాయికి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త మాత్రం సీఎం కేసీఆర్ దేన‌ని పేర్కొంటున్నారు.

ప్ర‌తిప‌క్షాలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని(Palla Rajeshwar Reddy) వెంట‌నే పార్టీ నుండి స‌స్పెండ్ చేయాల‌ని, ఆయ‌న ప‌ద‌విని తొల‌గించాల‌ని డిమాండ్ చేశాయి.

Also Read : Neeraj Chopra : చ‌రిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Leave A Reply

Your Email Id will not be published!