Arvind Kejriwal : ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతా – సీఎం
దేశమంతటా పర్యటిస్తానన్న కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పీఎం మోదీపై మండిపడ్డారు. భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గౌరవించకుండా కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఢిల్లీపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు పెత్తనం ఉండదని స్పష్టం చేసింది కోర్టు. ఇదే సమయంలో కేవలం లా అండ్ ఆర్డర్ , భూ సంబంధ అంశాలు మాత్రమే తన పరిధిలోకి వస్తాయని పేర్కొంది. మిగతావన్నీ ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికి చెందుతుందని స్పష్టం చేసింది సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.
దీనిని అడ్డుకునేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ నేను ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు సిద్దమయ్యాను. ఇందు కోసం దేశమంతటా పర్యటిస్తానని చెప్పారు. అన్ని పార్టీల అధ్యక్షులతో కలుస్తానని చెప్పారు. రాజ్యసభలో ఆర్డినెన్స్ బిల్లు వీగిపోయేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Rahul Gandhi
