Neeraj Chopra : చ‌రిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

స్వ‌ర్థం సాధించిన తొలి భార‌తీయుడు

Neeraj Chopra : భార‌త దేశానికి చెందిన నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్ లో స్వ‌ర్ణం సాధించాడు. బంగారు ప‌త‌కాన్ని సాధించిన తొలి భార‌తీయుడిగా నిలిచాడు. బుడాపెస్ట్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్ పోటీల్లో నీర‌జ్ చోప్రా 88.17 మీట‌ర్లు విసిరి గోల్డ్ మెడ‌ల్ ను పొందాడు.

Neeraj Chopra Got Gold Medal

పాకిస్తాన్ కు చెందిన అర్ష‌ద్ నదీమ్ ను క్లోజ్ ఫైట్ లో ఓడించాడు. ఇక అర్ష‌ద్ న‌దీమ్ 87.82 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం బుడా పెస్ట్ లోని నేష‌న‌ల్ అథ్లెటిక్స్ సెంట‌ర్ లో ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్ జ‌రిగింది.

నీర‌జ్ చోప్రా(Neeraj Chopra) స్వ‌స్థ‌లం హ‌ర్యానా. ఆయ‌న వ‌య‌సు 25 ఏళ్లు. ఇప్ప‌టికే ఒలింపిక్ ఛాంపియ‌న్ గా ఉన్నాడు. మిగిలి ఉన్న ఏకైక పోటీలో సైతం స‌త్తా చాటాడు. ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించాడు. ఇదే టోర్నీలో భార‌త్ కు చెందిన కిషోర్ జెనా 84.77 మీట‌ర్ల వ్య‌క్తిగ‌త అత్యుత్త‌మ త్రోతో 5వ స్థానంలో నిలిచాడు డిపి మ‌ను 84.14 మీట‌ర్లు విసిరి 6వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

నీర‌జ్ చోప్రా ఆసియా క్రీడ‌ల్లో బంగారు ప‌త‌కం, కామ‌న్వెల్త్ గేమ్స్ లో స్వ‌ర్ణం, డైమండ్ లీగ్ టైటిల్ , ఆసియా ఛాంపియ‌న్ షిప్ స్వ‌ర్ణం , యు-20 ప్ర‌పంచ టైటిల్ గెలుపొందాడు.

Also Read : Narayana Guru : ఒకే కులం ఒకే మ‌తం ఒకే దేవుడు

Leave A Reply

Your Email Id will not be published!