Snapana Tirumanjanam : తిరుమ‌ల‌లో స్న‌ప‌న తిరుమంజ‌నం

శ్రీివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా పూజ‌లు

Snapana Tirumanjanam : ప‌విత్ర‌మైన తిరుమ‌ల పుణ్య క్షేత్రంలోని శ్రీ‌వారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు శాస్త్రోక్తంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు . ఈ సంద‌ర్బంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారిని ప‌విత్ర మండపం లోని యాగ‌శాల‌కు వేంచేపు చేశారు.

Snapana Tirumanjanam in Tirumala

అక్క‌డ ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామి వారికి హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం సంపంగి ప్రాకారంలో వేడుక‌గా నృప‌న తిరుమంజ‌నం చేప‌ట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు, త‌దిత‌ర సుగంధ ద్రవ్యాల‌తో విశేషంగా స్వామి వారిని అభిషేకం చేశారు.

ఈ సంద‌ర్బంగా వేద పండితులు పంచ సూక్తాల‌ను స్మ‌రించారు. ఆ త‌ర్వాత ప‌విత్ర ప్ర‌తిష్ట చేప‌ట్టారు. అనంత‌రం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు విశేష స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించారు. భ‌క్తుల‌ను ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. వైదిక కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి.

ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తుండ‌డంతో ఆల‌యంలో క‌ళ్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

Also Read : Justcie NV Ramana : శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న జ‌స్టిస్ ర‌మ‌ణ

Leave A Reply

Your Email Id will not be published!