రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి రెచ్చి పోయారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈనెల 20వ తేదీన కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈమేరకు లక్ష మందికి పైగా హాజరయ్యేలా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బుధవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా సుదీర్ఘ రాజకీయ అనుభం కలిగిన, మచ్చలేని నాయకుడిగా ఎదిగారు . మంత్రిగా పని చేశారు. నిజాయితీగా ఉంటూ ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ వచ్చారు జీవన్ రెడ్డి. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేయాలని కంకణం కట్టుకున్నాడని వాపోయారు. నిజాయితీ, నిబద్దత , అనుభవం కలిగిన నేతలకు ఆ పార్టీలో స్తానం లేదన్నారు. అక్కడ ఉండలేక పోతున్నారని, కావాలని అలా చేస్తున్నాడని రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు జీవన్ రెడ్డి. తనను ఎవరూ నమ్మడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ నా వయసును గౌరవిస్తారని, తనను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారని చెప్పారు. కేసీఆర్ కు ప్రజలంటే పంచ ప్రాణం అని, నీలాగా కాదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.
