#Modi : మోదీ యూట‌ర్న్ తో ఓట్లు రాలేనా

రైతుల డిమాండ్ల‌కు త‌లొగ్గుతారా

Modi  : ఏదైనా ముఖ్య‌మైన అంశమో లేదా ప్ర‌మాద‌క‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

మోదీ కొలువు తీరాక ఇంత ప్ర‌శాంతంగా ఉండ‌డం చూడ లేదు.

బ‌హుశా తాను తీసుకున్న నిర్ణ‌యం త‌న‌కే రివ‌ర్స్ అవుతుంద‌ని ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌క పోవ‌చ్చు.

బ‌హుషా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటు ఎంత బ‌లీయ‌మైన‌దో, ఎంత‌టి శ‌క్తివంత‌మైన‌దో ఆయ‌న‌కే కాదు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా వ‌ర్తిస్తుంది.

ఇద్ద‌రికీ ఈ ఏడాది న‌వంబ‌ర్ పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ఖ‌ర్చు చేసినా,

తాయిలాలు స‌మ‌ర్పించినా, అధికారాన్ని ఉప‌యోగించినా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ప్ర‌జ‌లు త‌మ తీర్పును సుష్ప‌ష్టం చేశారు.

రాచ‌రిక వ్య‌వ‌స్థ‌ను గుర్తుకు తెచ్చేలా సాగిస్తున్న పాల‌న‌కు ఇది ఓ చెంప‌పెట్టుగా పేర్కొన‌డంలో త‌ప్పు లేదు. ఇదే స‌మ‌యంలో ఏడాది పూర్త‌యింది.

వ్య‌వ‌సాయ రంగాన్ని శాసించి కొద్ది మంది చేతుల్లోకి క‌ట్ట‌బెట్టేలా సాగు చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చింది కేంద్ర స‌ర్కార్(Modi).

వాటిని రద్దు చేయాల‌ని ఎంఎస్పీ – క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని కోరుతూ వేలాది మంది రైతులు స్వ‌చ్చంధంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు.

కేసులు న‌మోదు చేసినా, అరెస్టుల పాలు చేసినా, చివ‌ర‌కు వాహ‌నాల‌తో తొక్కించి చంపినా వారు ఏ మాత్రం సంమ‌య‌మ‌నం కోల్పోలేదు.

ఇది బ‌హుషా రైతులు సాధించిన చ‌రిత్రాత్మ‌క విజ‌యం. వీరి అలుపెర‌గ‌ని పోరాటం వెనుక ఎంద‌రో మేధావులు,

జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జాస్వామిక వాదులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, మెరుగైన స‌మాజం అంతా ఉంది.

అంతే కాదు రైతు సంఘాల నేత‌ల కృషి ఉంది. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు.

ఆరుగాలం పంట‌లు పండించి అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌ను తీవ్ర‌వాదులుగా పేర్కొన్నా వారు చెక్కు చెద‌ర‌లేదు.

విదేశాల నుంచి విరాళాలు అందుతున్నాయ‌ని నింద‌లు మోపినా వారు వెన‌క్కి త‌గ్గ లేదు ముందుకే సాగారు.

వారిని ఈ జాతి ముందు మ‌రోసారి దేశ ద్రోహులుగా చిత్రీక‌రించాల‌ని ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ లేదు.

చివ‌ర‌కు బీజేపీకే ఎదురు దెబ్బ త‌గిలింది. మోదీతో ఫోటోలు దిగిన స‌ద‌రు కార్య‌క‌ర్తే ఎర్ర‌కోట‌పై జెండా ఎగుర వేయ‌డం,

చివ‌ర‌కు చిక్క‌కుండా త‌ప్పించు కోవ‌డం,

తీరా సమాజం మొత్తం అత‌డే దోషి అంటూ తేల్చ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో త‌ప్పును క‌ప్పిపుచ్చుకుంది ప్ర‌భుత్వం.

ఏది ఏమైనా ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. బ‌హుషా రైతు సంఘాల నేత‌లు చెబుతున్న‌ట్లు దాదాపు 750 మందికి పైగా ఉంటార‌ని అంచ‌నా.

ఇంత జ‌రిగినా స్పందించ‌ని ప్ర‌ధాని, నోరు మెద‌ప‌ని మోదీ(Modi )ఉన్న‌ట్టుండి సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం విస్తు పోయేలా చేసింది.

కానీ ఆయ‌న మాట‌ల‌ను తాము న‌మ్మ‌మంటున్నారు రైతులు. ఎందుకంటే ఆయ‌న రైతుల విష‌యంలో , సాగు విష‌యంలో ఏ స్టాండ్ పై ఉండ లేదు.

త్వ‌ర‌లో 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పార్ల‌మెంట్ లో ర‌ద్దు చేయొచ్చు. ఇదే నిర్ణ‌యం ముందే తీసుకుని ఉండి ఉంటే రైతులు చ‌ని పోయి ఉండే వారు కాదు.

మోదీ ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయి. వాటికి ప‌రిష్కారం చూపాల్సింది ఆయ‌నే.

మ‌రి క్ష‌మాప‌ణ కోరిన ప్ర‌ధాని వ్యూహం ఫ‌లిస్తుందా రైతులు రేపొద్దున జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ తీర్పు ఎలా ఇవ్వ బోతున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Also Read : రైత‌న్న‌ల బ‌లిదానం పోరాటం స్ఫూర్తిదాయ‌కం

Leave A Reply

Your Email Id will not be published!