#PatCommins : ఆసిస్ టెస్టు టీమ్ కెప్టెన్ గా ‘క‌మిన్స్’

ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్

Pat Commins  : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆస్ట్రేలియా టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా ఆల్ రౌండ‌ర్ గా పేరొందిన పాట్ కమిన్స్(Pat Commins )ను ఎంపిక చేసింది.

ఈ విష‌యాన్ని ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించింది ఏసీబీ. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన టిమ్ పైన్ కు సార‌థిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అయితే పైన్ ఓ మ‌హిళ‌ల‌కు అస‌భ్య‌క‌ర‌మైన సందేశాలు పంపాడ‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అత‌డిపై విచార‌ణ‌కు ఆదేశించడంతో తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు టిమ్ పైన్.

అదే స‌మ‌యంలో ఏసీబీ ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. గ‌తంలో ఆస్ట్రేలియా టెస్టు టీమ్ కు కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రించిన స్టార్ ప్లేయ‌ర్లు డేవిడ్ వార్న‌ర్, స్టీవ్ స్మిత్ ల‌లో ఎవ‌రో ఒక‌రికి సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించ వ‌చ్చ‌ని క్రికెట్ వ‌ర్గాలు భావించాయి.

కానీ అనూహ్యంగా పాట్ క‌మిన్స్ (Pat Commins )కు ప‌గ్గాలు అప్ప‌గిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఆస్ల్రేలియా క్రికెట్ బోర్డు. అయితే ఊహించ‌ని రీతిలో స్టీవ్ స్మిత్ కు మ‌రో సారి చాన్స్ ఇచ్చింది.

క‌మిన్స్ కెప్టెన్ గా ఉంటాడ‌ని , మాజీ కెప్టెన్ , స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ ను వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేసింది.

దీంతో ఆసిస్ మెన్స్ టెస్ట్ జ‌ట్టుకు పూర్తి స్థాయి సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న మొద‌టి ఫాస్ట్ బౌల‌ర్ గా రికార్డుల్లో నిలిచాడు. ఇక ఆసిస్ టీమ్ కు క‌మిన్స్ 47వ కెప్టెన్ కావ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే యాషెస్ సీరీస్ కు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు పాట్ క‌మిన్స్.

Also Read : గంభీర్ ను బెదిరించిన ఈమెయిల్స్ గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!