#Covid19 : పీరియ‌డ్స్ టైంలో వ్యాక్సిన్ ఓకే – కేంద్రం

టీకాలు వేసుకునేందుకు ముందుకు రావాలి

Covid19 : ప్ర‌తి నెల నెలా స్త్రీల‌కు వ‌చ్చే ప్ర‌ధాన స‌మ‌స్య పీరియ‌డ్స్. ఆ నాలుగు రోజులు న‌ర‌కం. ఒక ర‌కంగా చెప్పాలంటే చెప్పుకోలేనంత బాధ ఉంటుంది మ‌హిళ‌ల‌కు.

దీనిని అధిగ‌మించేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు. ఇంకొంద‌రు త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌ను ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ దుమ్ము రేపుతోంది.

ప్ర‌తి ఒక్క‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ స‌మ‌యంలో క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కోవిడ్ -19 (Covid19)వ్యాక్సినేష‌న్ కు శ్రీ‌కారం చుట్టింది.

ఇప్ప‌టికే 11 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా ప‌లు రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వ్యాక్సినేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

అందులో తెలంగాణ రాష్ట్రం ఒక‌టి. అయితే పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఉన్న మ‌హిళ‌లు వ్యాక్సిన్ (Covid19)వేసుకోవాలో లేదోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

చాలా మంది యువ‌తులు, మ‌హిళ‌లు టీకా వేసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు.

దీంతో పీరియ‌డ్స్ అనేవి ప్ర‌తి నెలా వ‌చ్చే వ‌ని, ఇందులో వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర కుటుంబ‌, ఆరోగ‌గ్య మంత్రిత్వ శాఖ‌.

ఈ విష‌యంపై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రుతుస్రావం స‌మ‌యంలో కూడా టీకా తీసుకోవ‌చ్చ‌ని సూచించింది.

వాయిదా వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

అపోహ‌లు వీడాల‌ని, ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

యుక్త వ‌య‌సులో ఉన్న 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని సూచించింది.

Also Read : ఆస్ట్రాజెన్ కా పై ఆందోళ‌న వ‌ద్దు – సౌమ్యా

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!