#ITHyderabad : ఐటీలో హైద‌రాబాద్ అదుర్స్

జేఎల్ఎల్ నివేదిక వెల్ల‌డి

IT Hyderabad : ఒక‌ప్పుడు ఐటీ అంటే ఈ దేశంలో బెంగ‌ళూరు పేరు చెప్పే వారు. కానీ ఆ సీన్ మారింది. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ భార‌త్ అంటేనే ముందు హైద‌రాబాద్ వైపు చూస్తున్నారు.

ఐటీ, ఫార్మా, టెలికాం, అగ్రి సెక్టార్ ల‌లో తెలంగాణ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధిస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని నీతి ఆయాగ్ త‌న తాజా నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.

పురోభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్ టాప్ లో ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

గూగుల్, మైక్రోసాఫ్ట్ , ఒరాకిల్, పొలారిస్, అడిడాస్ , అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , త‌దిత‌ర టాప్ కంపెనీల‌న్నీ ఇక్క‌డ కొలువు తీరాయి. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తున్నాయి.

బ‌యో ఫార్మా సెక్టార్ లో సైతం హైద‌రాబాద్(IT Hyderabad) త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తోంది. ఇక రియ‌ల్ ఎస్టేట్ ప‌రంగా హైద‌రాబాద్ దూసుకు పోతోంది.

భార‌త దేశ సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగ‌ళూరును త‌ల‌ద‌న్నే రీతిలో మ‌న న‌గ‌రం ప‌రుగులు తీస్తోంది.

అంతే కాకుండా దేశంలోనే అత్య‌ధికంగా ఐటీ సెజ్ లు ఉన్న సిటీగా పేరొందింది. కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది.

పెట్టుబ‌డిదారుల‌కు, బ‌హుళ జాతి కంపెనీల‌కు, పేరొందిన కంపెనీల‌కు ఎర్ర తివాచీలు ప‌రిచింది.

మౌలిక వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో కీల‌కంగా మారిన ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.

జోన్స్ లాంగ్ లాసెలే సంస్థ త‌న తాజా నివేదిక‌లో ఐటీలో హైద‌రాబాద్(IT Hyderabad) లో టాప్ లో ఉంటోంద‌ని పేర్కొంది.

ఉబ‌ర్ , ఆపిల్ , క్వాల్ కామ్ సంస్థ‌లు ఇక్క‌డ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశాయి. ఐటీతో పాటు ఫార్మ‌,

బ‌ల్క్ డ్ర‌గ్ , ఏరోస్పేస్ , ఎల‌క్ట్రానిక్స్ ..టాయ్స్ రంగాల‌కు చెందిన కంపెనీలు సైతం ఇక్క‌డే కొలువు తీరాయి.

Also Read : త‌క్కువ ప్రీమియం ఎక్కువ లాభం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!