#PawanKalyan : బాధిత కుటుంబానికి జ‌న‌సేనాని భ‌రోసా

పిలుపునిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan  ; ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan )ఇవాళ హైద‌రాబాద్ లోని సైదాబాద్ లో చిన్నారి క్రాంతి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. తెలుగు రాష్ట్రాల‌లో చిన్నారి బాలిక అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం క‌లిగించింది.

ఇప్ప‌టికే ప‌లువురు ప‌రామ‌ర్శించారు. చిన్నారి కుటుంబీకుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

కుటుంబీకులు అనుమానం వ్య‌క్తం చేసిన‌ప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ .

పోలీసులు స‌కాలంలో చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఈ ఘ‌ట‌న‌ను ఖండించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు.

అంతే కాక ప్ర‌భుత్వం త‌ర‌పున బాధిత కుటుంబానికి స‌హాయం, ఓదార్పు అందించాల‌ని కోరారు.

ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంట‌నే ఆ ఏర్పాటు చేయాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan ).

కాగా దోషికి శిక్ష ప‌డేంత దాకా ఆ బాధిత కుటుంబానికి జ‌న‌సేన పార్టీ, తాను అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేలా చూడాల‌ని కోరారు.

స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మ‌న ప‌ట్ల మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌క పోతే ఇలాంటి దారుణాలు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

బాధితురాలిని కోల్పోవ‌డం బాధాక‌రంగా ఉంద‌న్నారు. పాప లేని లోటును ఎవ‌రూ పూడ్చ లేమ‌న్నారు. చిన్నారి ఘ‌ట‌న త‌న‌ను ఎంతో క‌లచి వేసింద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ధైర్యంగా ఉండాల‌ని బాధిత కుటుంబానికి తాను భ‌రోసా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జ‌న‌సేనాని.

Also Read : మాలో నువ్వా నేనా

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!