#JEEMains2021 : జేఈఈ మెయిన్స్ రిజ‌ల్ట్స్ డిక్లేర్

తెలుగు విద్యార్థుల జోరు

JEE Mains 2021 : దేశ వ్యాప్తంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే జేఈఈ మెయిన్స్ రిజ‌ల్ట్స్ (JEE Mains 2021)విడుద‌ల‌య్యాయి. నాలుగో విడ‌త ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ – ఎన్టీఏ ప్ర‌క‌టించింది.

దేశ వ్యాప్తంగా 44 మంది స్టూడెంట్స్ 100 ప‌ర్సంటైల్ సాధించ‌గా వారిలో 18 మంది విద్యార్థుల‌కు ఫ‌స్ట్ ర్యాంక్ వ‌చ్చింది.

వీరిలో తెలుగు విద్యార్థులు త‌మ జోరు కొన‌సాగించారు. తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు అభ్య‌ర్థులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన న‌లుగురు ఉన్నారు.

మొత్తం 9 ల‌క్ష‌ల 34 వేల 602 మంది విద్యార్థులు మెయిన్స్ ప‌రీక్ష‌కు హాజ‌రయ్యారు. రాష్ట్రానికి చెందిన కొమ్మ శ‌ర‌ణ్య‌, వెంక‌ట ఆదిత్య ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు.

ఏపీకి చెందిన దుగ్గినేని వెంక‌ట ప‌నీష్ , ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న్ ప‌ల్లి రాహుల్ నాయుడు, క‌ర‌ణం లోకేష్ మొద‌టి ర్యాంక్ సాధించారు.

జేఈఈ మెయిన్(JEE Mains 2021) నాలుగో విడ‌త ఎగ్జామ్ ను ఆగ‌స్టు 26, 27, 31న‌, సెప్టెంబ‌ర్ 1, 2 తేదీల్లో నిర్వ‌హించారు.

ఈ ప‌రీక్ష‌ను దేశ వ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాష‌ల్లో నిర్వ‌హించారు. ఈసారి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మాతృభాష‌లోనే రాసే స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని మోదీ నిర్ణ‌యించారు.

ఇందులో భాగంగా ఈసారి ప‌రీక్ష‌ను తెలుగు, ఇంగ్లీష్ , హిందీ, గుజ‌రాతి, అస్సామీ, బెంగాలీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, మ‌రాఠీ, ఒడిశా, పంజాబీ , త‌మిళం భాష‌ల్లో చేప‌ట్టారు.

ఈ ప‌ర‌క్ష ద్వారా ఎన్ఐటీ, ఐఐఐటీల‌తో పాటు కేంద్ర నిధుల‌తో న‌డుస్తున్న సాంకేతిక విద్యా సంస్థ‌ల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

ఏపీ, తెలంగాణ వారితో పాటు వివిధ రాష్ట్రాల‌కు చెందిన అభ్య‌ర్థులు టాప్ లో నిలిచారు. గౌర‌బ్ దాస్ , వైభ‌వ్ విశాల్ , సిద్దాంత్ ముఖ‌ర్జీ, రుచిర్ బ‌న్స‌ల్ ,

అమ‌య్య సింఘాల్ , మృదుల్ అగ‌ర్వాల్ , అభిజిత్ తంబ‌త్ , కావ్య చోప్రా, పుల్కిత్ గోయ‌ల్ , పాల్ అగ‌ర్వాల్ , గుర్ర‌మిత్ సింగ్ , అన్షుల్ వ‌ర్మ ఉన్నారు.

Also Read : డిగ్రీ ఉంటే చాలు భారీ వేత‌నం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!