#MithaliRaj : ఐసీసీ ర్యాంకింగ్ లో మెరిసిన మిథాలీ

టాప్ లోకి చేరుకున్న స్టార్ ప్లేయ‌ర్

Mithali Raj : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ తాజాగా మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ ర్యాంకింగ్ లో భార‌త మ‌హిళా క్రికెట్ టీం సార‌థిగా ఉన్న మ‌న హైద‌రాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్(Mithali Raj) టాప్ ర్యాంక్ లో నిలిచింది.

మిథాలీ రాజ్ కు 762 పాయింట్లు రాగా ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ లిజెల్లీ లీకి కూడా అంతే పాయింట్లు ద‌క్కాయి.

దీంతో వీరిద్ద‌రూ స‌మాన పాయింట్ల‌తో నెంబ‌ర్ వ‌న్ లో నిలిచారు.

ఇదిలా ఉండ‌గా వెస్టిండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో లిజెల్లీ లీ అజేయంగా 91 ప‌రుగులు చేసింది.

దీంతో ఆమె ర్యాంకు పెరిగింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ మూడో ప్లేస్ లో కొన‌సాగుతోంది.

ఇక టీమిండియా ఓపెన‌ర్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఆల్ రౌండ‌ర్ల జాబితాలో దీప్తి శ‌ర్మ ఐద‌వ ప్లేస్ లో కొన‌సాగుతోంది. మ‌రో వైపు టీ20 ర్యాంకింగ్స్ లో భార‌త యువ స్టార్ ప్లేయ‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ టాప్ లో నిల‌వ‌డం విశేషం.

మిథాలీ రాజ్ సార‌థ్యంలో భార‌త మ‌హిళా క్రికెట్ టీమ్ ఇంగ్లండ్ లో ప‌ర్య‌టించింది.

ఆ టూర్ లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. అద్భుతంగా రాణించ‌డంతో ఈసారి వ‌న్డే ర్యాంకింగ్స్ లో గ‌ణ‌నీయ‌మైన పాయింట్లు సాధించింది మిథాలీ రాజ్(Mithali Raj).

అంతే కాకుండా ఇదే విదేశీ టూర్ లో మ‌హిళా క్రికెట్ వ‌రల్డ్ లో అన్ని ఫార్మాట్ ల‌లో క‌లిపి 10 వేల ప‌రుగులు సాధించిన అరుదైన మ‌హిళా ప్లేయ‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది ఈ హైద‌రాబాదీ ముద్దు గుమ్మ‌.

క్రీడాభిమానులు ఆమెను మ‌హిళా టెండూల్క‌ర్ గా పిలుస్తారు.

భార‌తీయ మహిళా క్రికెట్ లో అనేక విజ‌యాలు సాధించడంలో కీల‌క పాత్ర పోషించింది మిథాలీ రాజ్.

Also Read : ధోనీకే ష‌కీబ్ హ‌స‌న్ ప్ర‌యారిటీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!