#DavidGower : రోహిత్ సేన‌కే ఐపీఎల్ చాన్స్

జోస్యం చెప్పిన డేవిడ్ గోవ‌ర్

David Gower : ఇండియ‌న్ ప్రిమీయం లీగ్ -2021 సెకండ్ సీజ‌న్ యూఏవీ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే దానిపై త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఆయా జ‌ట్లు ఆడేందుకు స‌ర్వ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. మైదానంలో ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

ఐపీఎల్ లో భాగంగా అత్య‌ధికంగా టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియ‌న్స్ ఈసారి నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

ఐదో స్థానంలో మూడు మ్యాచ్ లు గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ప‌రాజ‌యం పాలైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఉంది.

ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా ప్ర‌థ‌మ‌, ద్వతీయ స్థానంలో ఉన్నాయి.

ఈసారి ఆట రస‌వ‌త్త‌రంగా మారింది. వాస్త‌వానికి ఐపీఎల్ లీగ్ భార‌త్ లోనే ముగియాల్సి ఉంది.

కాగా క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ అర్ధాంత‌రంగా వాయిదా వేసింది.

త‌ట‌స్థ వేదిక‌గా యూఏఈని ఎంచుకుంది. దీంతో ఆదివారం నుంచీ సంరంబం మొద‌లు కానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 29 మ్యాచ్ లు జ‌ర‌గ‌గా ఇంకా 31 మ్యాచ్ లు కొన‌సాగాల్సి ఉంది.

అన్ని జ‌ట్లు శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ డేవిడ్ గోవ‌ర్(David Gower) ఐపీఎల్ టైటిల్ ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై స్పందించాడు.

త‌న ఓటు మాత్రం రోహిత్ శ‌ర్మ సార‌థ్యం వ‌హిస్తున్న ముంబై ఇండియ‌న్స్ కే వేశాడు. ఆ జ‌ట్టుకే గెలిచే స‌త్తా సామ‌ర్థ్యం ఉంద‌న్నాడు గోవ‌ర్.

Also Read : ధోనీకే ష‌కీబ్ హ‌స‌న్ ప్ర‌యారిటీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!