#SupremeCourt : కేంద్ర స‌ర్కార్ పై సుప్రీం సీరియ‌స్

మా టైం వేస్ట్ చేశారంటూ ఆగ్ర‌హం

Supreme Court : కేంద్ర స‌ర్కార్ అనురిస్తున్న వైఖ‌రిని మ‌రోసారి త‌ప్పు ప‌ట్టింది సీజేఐ ఎన్.వి.ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో ప్ర‌వ‌ర్తిస్తోందంటూ మండిప‌డింది. ట్రిబ్యున‌ళ్ల‌లో నియామ‌కాల‌పై ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌ట్టింది.

తాము చేసిన సిఫార‌సుల నుంచి కేవ‌లం కొంత మందిని మాత్ర‌మే తీసుకోవ‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

రెండు వారాల్లో ట్రిబ్యున‌ల్ నియామ‌కాలు మొత్తం పూర్తి కావాల‌ని , ఒక‌వేళ ఎవ‌రినైనా నియ‌మించ‌క పోతే కార‌ణం చెప్పాల‌ని ఆదేశించింది.

మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశమ‌ని, క‌చ్చితంగా చ‌ట్టాన్ని అనుస‌రించాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా సీజేఐ ర‌మ‌ణ సీరియ‌స్(Supreme Court) అయ్యారు.

స‌ర్కార్ అడినందు వ‌ల్ల‌నే క‌రోనా కాలంలోనూ దేశ‌మంతా తిరిగి 544 మందిని ఇంట‌ర్వ్యూ చేశాం.

ఇందులో 11 మంది జ్యూడిషియ్ స‌భ్యులు, 10 మంది టెక్నిక‌ల్ స‌భ్యుల పేర్లు ఇచ్చామ‌న్నారు.

నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ నియామ‌కాలు చూశాను. అందులో నుంచి కొంద‌రినే నియ‌మించార‌న్నారు.

ఇదేం ఎంపిక అని ఫైర్ అయ్యారు. ఇన్ క‌మ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ లోనూ అలాగే చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనికి అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ స్పందించారు.

కొన్ని సిఫార‌సుల‌ను వ‌దిలేసే చాన్స్ స‌ర్కార్ కు ఉంటుంద‌న్నారు. దీనిపై పూర్తి అభ్యంత‌రం తెలిపారు ర‌మ‌ణ‌.

ఇది చాలా దుర‌దృష్ట‌కరం. మా విలువైన కాలాన్ని మీరు వేస్ట చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వానిదే తుది నిర్ణ‌య‌మైతే సెల‌క్ష‌న్ క‌మిటీకి ఉన్న విలువ ఏంటి అంటూ ప్ర‌శ్నించారు.  ఈ అంశంపై సీజేఐతో (Supreme Court)పాటు జ‌స్టిస్ చంద్ర‌చూడ్ , జ‌స్టిస్ నాగేశ్వ‌ర్ రావ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది.

Also Read : యూపీ కాంగ్రెస్ బంప‌ర్ ఆఫ‌ర్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!