#GautamGambhir : గౌతం గంభీర్ టీమిండియా ఇదే

పాకిస్తాన్ తో ఆడే జ‌ట్టు అంచ‌నా

Gautam Gambhir  : ప్ర‌పంచ‌మంతా అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తోంది క్రీడాలోకం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం. యూఏఈ వేదిక‌గా త్వ‌ర‌లో ఈ సంబురం ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్లు, దిగ్గ‌జాలు అంచ‌నాలు వేస్తున్నారు.

ఆయా జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. టోర్నీ సంగ‌తేమిటో కానీ దాయాది దేశాలైన పాకిస్తాన్ , భార‌త జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగనుంది.

ఇప్ప‌టికే ఈ విష‌యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప‌గ్గాలు చేపట్టిన మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రజా.

వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ తో ఆడేట‌ప్పుడు వంద శాతం ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌న్నాడు.

తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ (Gautam Gambhir  )సంచ‌లన కామెంట్స్ చేశాడు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా వ‌చ్చే నెల 24న ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇరు జ‌ట్ల మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

ఈ త‌రుణంలో ఈ మ్యాచ్ లో బ‌రిలోకి దిగ‌బోయే భార‌త జ‌ట్టు తుది మ్యాచ్ ను అంచ‌నా వేశాడు గౌతం గంభీర్(Gautam Gambhir  ).

స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ తో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గౌతం గంభీర్ పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా 15 మంది జాబితాలో అశ్విన్ కు చోటు ఇవ్వ‌లేదు. తాజ‌గా అంచ‌నా వేసిన ఎంపిక చేసిన టీమ్ ఇలా ఉంది.

కేఎల్ రాహుల్ , రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్ , రిష‌బ్ పంత్ ,

హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, భువ‌నేశ్వ‌ర్ కుమార్ , వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, జ‌స్ ప్రీత్ బుమ్రా.

Also Read : ధోనీకే ష‌కీబ్ హ‌స‌న్ ప్ర‌యారిటీ

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!