#AjayKumarLallu : యూపీ కాంగ్రెస్ బంప‌ర్ ఆఫ‌ర్

ఎమ్మెల్యే ద‌ర‌ఖాస్తుకు రూ. 11 వేల ఫీజు

Ajay Kumar Lallu : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందా లేక కావాల‌నే ప్ర‌క‌టించిందా అన్న‌ది తేల్చుకోలేక పోతున్నారు కాంగ్రెస్ నేత‌లు, శ్రేణులు. విచిత్రం ఏమిటంటే త్వ‌ర‌లో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ త‌రుణంలో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ, స‌మాజ్ వాది పార్టీల‌న్నీ బ‌రిలో ఉండ‌నున్నాయి.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా టికెట్ కావాల్సిన వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోమ‌ని పిలుపునిచ్చింది.

అయితే అందులో ఓ మెలిక కూడా పెట్టింది. అదేమిటంటే ద‌ర‌ఖాస్తుతో ప‌టు రూ. 11 వేలు చెల్లించాల్సిందేనంటూ మెలిక పెట్టింది.

ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ కు పంపించాల‌ని కోరింది.

అలాగైతేనే మీ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తాం లేకుంటే ప‌క్క‌న పెట్టేస్తామ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇలాంటి విచిత్ర‌మైన కండీష‌న్ పెట్టింది సోనియాగాంధీ నేతృత్వంలోని ఏఐసీసీ.

ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎలాంటి పొత్తు లేకుండానే పోటీ చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు పార్టీకి చెందిన జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ సీఎం అభ్య‌ర్థిగా ఫోకస్ అవుతోంది.

ఇప్ప‌టికే 12,000 వేల కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని పార్టీ నిర్ణ‌యించింది.

ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. ఈ త‌రుణంలో ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఒకింత పార్టీ శ్రేణుల‌ను అయోమయానికి గురి చేసింది.

మొత్తం 403 స్థానాల్లో త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపాల‌ని నిర్ణ‌యించింది కాంగ్రెస్ పార్టీ.

టికెట్ కావాల‌ని అనుకున్న వాళ్లంతా ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, రూ. 11 వేలు చెల్లించాల‌ని ష‌ర‌తుతో పాటు ఈనెల 25 డెడ్ లైన్ విధించారు ఆ పార్టీ చీఫ్ అజ‌య్ కుమార్ ల‌ల్లూ(Ajay Kumar Lallu ) .

Also Read : రాష్ట్రాలదే తుది నిర్ణ‌యం జోక్యం చేసుకోం

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!