#PriyankaTibrewal : భ‌వానీపూర్ బీజేపీ అభ్య‌ర్థికి షాక్

కోడ్ ఉల్లంఘించారంటూ నోటీస్

Priyanka Tibrewal : ఫైర్ బ్రాండ్ తో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో ఇంకా అర్థ‌మైన‌ట్లు లేదు భార‌తీయ జ‌న‌తా పార్టీకి. ఇప్ప‌టికే తాను కొట్టిన దెబ్బ‌కు ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ విల విల లాడుతోంది.

మ‌రో వైపు సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన ఎంపీ అర్జున్ సింగ్ త‌న‌కు ప్రాణ ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వాపోతున్నాడు. ఇంకో వైపు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆ పార్టీకి మౌత్ పీస్ గా మారారు.

ఈ త‌రుణంలో ప్ర‌ధాని ప‌రివారం త‌న‌పై కేంద్ర సంస్థ‌ల‌తో దాడుల‌కు పాల్ప‌డిని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బెద‌రడం లేదు.

త‌న ప‌వ‌ర్ ను ఉప‌యోగిస్తోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఆమెపై అన‌ర్హురాలంటూ,

దీదీ కేసుల సంగతేంటి అంటూ నిల‌దీసిన భ‌వానీపూర్ బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal)కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.

ఎన్నిక‌ల కోడ్ ను ఆమె ఉల్లంఘించారంటూ టీఎంసీ ఫిర్యాదు చేసింది.

పెద్ద ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ చేప‌ట్టి మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ , కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు ఉల్లంఘించారంటూ ఆరోపించింది.

ఎలాంటి ప‌ర్మిష‌న్ లేకుండానే నామినేష‌న్ వేశార‌ని పేర్కొంది.

ధ‌నుచి నాచ్ నృత్యం చేసుకుంటూ వ‌చ్చింద‌ని ఆరోపించింది.

అంతే కాకుండా రిట‌ర్నింగ్ అధికారి జారీ చేసిన నోటీసులో భ‌వానీ పూర్ పోలీస్ స్టేష‌న్ ఇన్ చార్జి ఆఫీస‌ర్ స‌మ‌ర్పించిన నివేదిక‌ను సైతం ప్ర‌స్తావించింది.

ఇదిలా ఉండ‌గా టీఎంసీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప్రియాంక టిబ్రేవాల్ తోసి పుచ్చారు.

ఉప ఎన్నిక‌లో తాను పోటీ చేస్తుండడంతో టీఎంసీ , సీఎం దీదీ భ‌య‌ప‌డుతోంద‌న్నారు. ఈసీ ఇచ్చిన నోటీసుకు స‌మాధానం ఇస్తాన‌న్నారు.

Also Read : టీఎంసీ న‌న్ను టార్గెట్ చేసింది – అర్జున్ సింగ్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!