#Telegram : డౌన్ లోడ్ లో టెలిగ్రామ్ రికార్డ్

ఫేస్ బుక్ కు బిగ్ షాక్

Telegram : ఈ ఏడాది సెకండ్ ఫేస్ ఫేస్ బుక్ కు అంత‌గా క‌లిసి వ‌చ్చిన‌ట్లు లేదు. ర‌ష్యాకు చెందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ దూసుకు పోతోంది. దీని దెబ్బ‌కు ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ యూజ‌ర్లు టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో టెలిగ్రామ్(Telegram) స‌రికొత్త రికార్డ్ ను న‌మోదు చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక బిలియ‌న్ పైగా యూజ‌ర్లు డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా టెలిగ్రామ్ చ‌రిత్ర సృష్టించింది.

ఒక బిలియ‌న్ అంటే సుమారు 100 కోట్లు అన్న మాట‌. ఈ టెలిగ్రామ్ ను ర‌ష్యాకు చెందిన పావెల్ దురోవ్ 2013లో దీనిని రూపొందించాడు.

సేమ్ టు సేమ్ వాట్సాప్ లాగా పోలి ఉండ‌డం, ఎలాంటి క‌ఠిన‌త‌ర‌మైన రూల్స్ లేక పోవ‌డం క‌లిసొచ్చింది టెలిగ్రామ్ కు. ఈనెల 4న మ‌రోసారి ఫేస్ బుక్ దాని అనుబంధ సంస్థ‌ల‌న్నీ బ్రేక్ డౌన్ అయ్యాయి.

దీంతో టెలిగ్రామ్ పంట పండింది. దానికి బాగా క‌లిసొచ్చింది. యూజ‌ర్లు వీటికంటే టెలిగ్రామ్ బెట‌ర్ అంటూ అటు వైపు మ‌ళ్లి పోవడంతో దాని ట్రాఫిక్ బాగా పెరిగింది.

ఆ ఒక్క రోజే 70 మిలియ‌న్ల మంది టెలిగ్రామ్ ను ఎంచుకున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు లో టెలిగ్రామ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక బిలియ‌న్ డౌన్ లోడ్ ల మైలు రాయిని దాడింద‌ని సెన్సార్ ట‌వ‌ర్ డేటా వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే ఈ సంఖ్య మార్క్ దాటిన ఫేస్ బుక్, వాట్సాప్ , ఇన్ స్టా , స్నాప్ చాట్ , స్పాటిఫై , నెట్ ఫ్లిక్స్ స‌ర‌స‌న టెలిగ్రామ్ కూడా చేరింద‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త మార్కెట్ లో అతి పెద్ద న‌మోదైన సంస్థ‌గా టెలిగ్రామ్ నిల‌వ‌డం విశేషం.

Also Read : ఝున్ ఝున్ వాలా పంట పండింది

Leave A Reply

Your Email Id will not be published!