#PuneethRajkumar : మంత్రాల‌యంతో బంధం చచ్చేంత ఇష్టం

పునీత్ రాజ్ కుమార్ రాఘ‌వేంద్ర స్వామి భ‌క్తుడు

Puneeth Rajkumar : క‌న్న‌డ నాట తీవ్ర విషాదం నెల‌కొంది. సినీ రంగంలో త‌న‌కంటూ బిగ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణంతో శోక‌సంద్రంలో మునిగి పోయింది యావ‌త్ సినీ లోకం.

ఆయ‌న పార్థివ దేహాన్ని చూసేందుకు వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నారు. కంఠీర‌వ స్టేడియం పూర్తిగా త‌న ఫ్యాన్స్ తో నిండి పోయింది. న‌టుడిగా చేసిన‌వి కొన్ని చిత్రాలే అయినా అవ‌న్నీ బిగ్ స‌క్సెస్ గా నిలిచాయి.

ఆయ‌న న‌టుడిగా ఎంత ఎత్తుకు ఎదిగారో దాతృత్వం చాటు కోవ‌డంలో, సేవ చేయ‌డంలో, సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలో త‌న‌కు సాటి లేరు ఎవ‌రూ అని నిరూపించుకున్నారు.

అనాథ శ‌ర‌ణాల‌యాలు, వృద్దుల కోసం ఆశ్ర‌మాలు, పేద పిల్ల‌ల చ‌దువు కోసం ఉచితంగా పాఠ‌శాల‌లు, గోవుల‌ను ర‌క్షించేందుకు కోసం గోశాల‌లు, ఇలా చెప్పుకుంటూ పోతే క‌ష్టాలలో ఎవ‌రు ఉన్నా స‌రే పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) ఆదుకునే వారు.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన సేవ‌లే అత‌డిని దేవుడిగా కొలుస్తున్నారు క‌న్న‌డ‌వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) కు ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.

ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవ‌డం, క‌ష్టాల్లో ఉన్న వారికి తాను ఉన్నానంటూ భ‌రోసా ఇస్తూ వ‌చ్చారు. న‌టుడిగా, సేవ‌కుడిగా కంటే ఆయ‌న‌లో గొప్ప భ‌క్తుడు కూడా దిగా ఉన్నాడు.

పునీత్ రాజ్ కుమార్ కు మంత్రాల‌యం అంటే విప‌రీత‌మైన అభిమానం. ఆయ‌న‌కు శ్రీ రాఘ‌వేంద్ర స్వామి అంటే చ‌చ్చేంత ఇష్టం. త‌న‌కు ఎప్పుడు వీలైతే అప్పుడు మంత్రాల‌యం పీఠాన్ని ద‌ర్శంచు కోవ‌డం ఆన‌వాయితీగా మారింది.

త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉన్న ఆ న‌టుడు ఇప్పుడు లేక పోవ‌డంపై తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు మంత్రాల‌య పీఠాధిప‌తి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వాములు.

Also Read : యునెస్కోకు మ‌రిన్ని ప్ర‌తిపాద‌న‌లు

Leave A Reply

Your Email Id will not be published!