#TSVHUB : దుబాయ్ ఎక్స్ పోలో ‘టీఎస్ వీ హ‌బ్’

మ‌హిళా సార‌థ్య అంకురాల‌కు ఆద‌ర‌ణ‌

TSV HUB : స్టార్ట‌ప్ ల‌కు భారీ ఆద‌ర‌ణ ఉంటోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అంకురాలు కుప్ప‌ల కొద్దీ పుట్టుకు వ‌స్తున్నాయి. భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స్టార్ట‌ప్ ఇండియా పేరుతో ప్రోత్స‌హిస్తోంది.

ఇక దేశంలోనే స్టార్ట‌ప్ ల‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించ‌డంలో టాప్ లో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే టీహ‌బ్, వీహ‌బ్, ఫార్మా హ‌బ్, అగ్రి హ‌బ్(TSV HUB) ఏర్పాటు చేసింది.

తాజాగా దుబాయ్ ఎక్స్ పో 2020లో తెలంగాణ మ‌హిళ‌ల సార‌థ్యంలోని స్టార్ట‌ప్ లు మ‌దుప‌రుల‌ను ఆకట్టుకునే దిశ‌గా వెళుతున్నాయి.

భార‌తీయ పెవిలియ‌న్ ఇండియా ఇన్నోవేష‌న్ హ‌బ్ లో మూడు రోజుల పాటు తెలంగాణ వీక్ పేరుతో రాష్ట్రానికి చెందిన స్టార్ట‌ప్ ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది.

ఈనెల 11 వ‌ర‌కు జ‌రిగే ఈ ఎక్స్ పో సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఇండ‌స్ట్రీ లీడ‌ర్ల‌తో రాష్ట్ర మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ వ్యాపార విస్త‌ర‌ణ‌, ఉత్ప‌త్తి ల‌క్ష్యాలు, త‌దిత‌ర ఆలోచ‌న‌ల్ని పంచుకుంటున్నారు.

దీంతో పెట్ట‌బుడుల్ని ఆహ్వానిస్తున్నారు. వీరిలో ఆర్కిట్యూడ్ వ్య‌వ‌స్థాప‌క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ విజ‌య దుర్గ కొప్పి శెట్టి, హెకోల్ ఫౌండ‌ర్ దీప్తి నాథ‌లైస్ , హీలో డిజైన్ సార‌థులు మౌన గుమ్మ‌డి, సాహిత్ గుమ్మ‌డి, రేడియ‌స్ ఎడ్యుటెక్ ఫౌండ‌ర్స్ నాగ‌మ‌ల్లిక వ‌ల్లూరు, సిద్దార్థ మాలెంపాటి ఉన్నారు.

మ‌హిళా ఎంట‌ర్ ప్రెన్యూర్స్ కు ఆర్థికంగా అండ‌గా నిలుస్తూ మార్కెట్ లో మెరుగైన అవకాశాల‌ను క‌ల్పించ‌డంలో వీ హ‌బ్ విశేషంగా కృషి చేస్తోంది.

ఇదిలా ఉండగా అంత‌ర్జాతీయ మార్కెట్ కు విస్త‌రించేందుకు మ‌హిళ‌ల నాయ‌క‌త్వంలోని స్టార్ట‌ప్ ల‌కు ఈ వ‌ర‌ల్డ్ ఎక్స్ పో 2020 చ‌క్క‌ని వేదిక అని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ పేర్కొన్నారు.

Also Read : మార్కెట్ లో ఎస్‌యూవీ లుక్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!