#JIO : డేటా ‘డౌన్ లోడ్’ లో ‘జియో’ టాప్ 

అదే బాట‌లో ఎయిర్ టెల్ ..వొడా ఫోన్ 

JIO  : భార‌తీయ టెలికాం సెక్టార్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సొంతం చేసుకున్న రిల‌య‌న్స్ జియో త‌న స‌త్తా చాటుతోంది. ఎప్ప‌టి లాగే టెలికాం రెగ్యులేట‌ర్ – ట్రాయ్ తాజాగా వెల్ల‌డించింది.

4జీ సర్వీస్ ప్రొవైడ‌ర్ల‌లో అత్య‌ధిక స‌గ‌టు డేటా డౌన్ లోడ్ వేగం సెక‌ను 21.9 మెగా బిట్ ను అందిస్తూ రిల‌య‌న్స్ జియో (JIO )అగ్ర‌స్థానంలో నిలిచింది.

జియోతో పాటు భార‌తీ ఎయిర్ టెల్ , వోడా ఫోన్ ఐడియా నెట్ వ‌ర్క్ డేటా డౌన్ లోడ్ వేగాన్ని పెంచుతూ వ‌చ్చాయి.

జియో నెట్ వ‌ర్క్ తో ఉన్న అంత‌రాన్ని కొంత మేర త‌గ్గించాయి. 4జీ డేటా డౌన్ లోడ్ స్పీడ్ లో స్వ‌ల్పంగా త‌గ్గింది.

తాజాగా జూన్ లో న‌మోదు చేసిన 21.9 ఎంబీప‌సీ వేగం స్థాయిని అక్టోబ‌ర్ నెల‌లో జియో(JIO )నెట్ వ‌ర్క్ మ‌ళ్లీ ప్రారంభించింది.

ఇదిలా ఉండ‌గా ఎయిర్ టెల్ , వోడా ఫోన్ ఐడి డేటా డౌన్ లోడ్ వేగంలో దాదాపు రెండున్న‌ర రెట్లు పెరిగింది.

ఎయిర్ టెల్ 4జీ డేటా డౌన్ లోడ్ వేగం జూన్ లో 5 ఎంబీపీఎస్ ఉండ‌గా అక్టోబ‌ర్ లో 13.2 ఎంబీపీఎస్ కు పెరిగింది.

ఇవ‌క వీఐఎల్ 4జీ వేగం ఐదు నెల‌ల్లో 6.5 ఎంబీపీఎస్ నుంచి 15.6 ఎంబీపీఎస్ కు చేరింది.

అక్టోబ‌ర్ లో 4జీ డేటా అప్ లోడ్ వేగం విష‌యంలో వీఐఎల్ ఆధిక్యాన్ని చాటింది.

కంపెనీ నెట్ వ‌ర్క్ 7.6 ఎంబీపీఎస్ అప్ లోడ్ వేగాన్ని న‌మోదు చేసింది. గ‌త ఐదు నెల‌ల త‌ర్వాత అత్య‌ధికంగా ఉంది. డౌన్ లోడ్ వేగం వినియోగ‌దారుల‌కు ఇంట‌ర్నెట్ నుండి కంటెంట్ ను యాక్సెస్ చేసే క్ర‌మంలో సాయ ప‌డుతోంది.

వీడియోల‌ను త‌యారు చేసేందుకు వీల‌వుతుంది. ఎయిర్ టెల్ , జియో నెట్ వ‌ర్క్ 5.2, ఎంబీపీఎస్ 6.4 ఎంబీపీఎస్ 4జీ డేటా అప్ లోడ్ వేగాన్ని న‌మోదు చేయ‌డం విశేషం.

Also Read : ఖాతాదారుల‌కు ఎస్బీఐ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!