#KanganaRanaut : ‘కంగ‌నా’ ప‌ద్మ‌శ్రీ వెన‌క్కి తీసుకోండి

రాష్ట్ర‌ప‌తికి డీఎస్జీఎంసీ ఫిర్యాదు

Kangana Ranaut  :వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్న బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut  )పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

సిక్కు స‌మాజాన్ని ఆమె ప్ర‌ధానంగా టార్గెట్ చేసుకుని జుగుస్సాక‌ర‌మైన రీతిలో వ్యాఖ్య‌లు చేస్తోందంటూ ఢిల్లీ సిక్కు గురు ద్వారా మేనేజ్ మెంట్ క‌మిటీ – డీఎస్జీఎంసీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసింది.

త‌మనే టార్గెట్ చేసుకోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంది. నిత్యం ఏదో కామెంట్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకునేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించింది.

దేశం ప‌ట్ల‌, స‌భ్య స‌మాజం పట్ల అత్యంత బాధ్యతా రాహిత్య‌మైన రీతిలో ఆమె కామెంట్స్ ఉంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

భార‌త దేశంలో నాలుగో అత్యున్న‌త‌మైన పుర‌స్కారంగా భావించే ప‌ద్మ‌శ్రీ అవార్డును వెంట‌నే కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut  ) నుంచి వెన‌క్కి తీసుకోవాల‌ని గురు ద్వారా మేనేజ్ మెంట్ క‌మిటీ డిమాండ్ చేసింది.

లేని ప‌క్షంలో ఆమె తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను, ప్ర‌ధానంగా సిక్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కంగ‌నా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ మ‌రింత ఉద్రిక్త‌లు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డింది.

1984 నాటి సిక్కుల ఊచ కోత‌ను స‌మ‌ర్థిస్తూ నాటి ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఖ‌లీస్థానీల‌కు వ్య‌తిరేకంగా మంచి నిర్ణ‌యం తీసుకున్నారంటూ కామెంట్ చేసింద‌ని తెలిపింది.

సింఘు స‌రిహ‌ద్దులో ఆందోళ‌న చేస్తున్న ఓ సిక్కు రైతు త‌ల్లిని కూడా ఆమె అవ‌మాన‌క‌ర రీతిలో వ్యాఖ్యానించింద‌ని పేర్కొంది గురు ద్వారా క‌మిటీ. స్వాతంత్ర స‌మ‌ర యోధులు భ‌గ‌త్ సింగ్ , సుఖ్ దేవ్ , రాజ్ గురు, ఆజాద్ ల‌ను అవ‌మానించేలా మాట్లాడిందంటూ వాపోయింది.

Also Read : కేసీఆర్ నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం – రామ్

Leave A Reply

Your Email Id will not be published!