#KanganaRanaut : రైతుల‌పై కామెంట్ కంగ‌నాపై కేసు

సిక్కు మ‌త‌పెద్ద‌ల ఫిర్యాదు

Kangana Ranaut  : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేసే బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut )కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

ఏదో ఒక అంశాన్ని తీసుకోవ‌డం దానికి భిన్నంగా కామెంట్స్ చేయ‌డం చివ‌ర‌కు సారీ చెప్ప‌డం అల‌వాటుగా మారింది కంగ‌నాకు. కేంద్రం తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ పెద్ద ఎత్తున రైతులు గ‌త ఏడాది కాలంగా ఆందోళ‌న చేస్తూ వ‌స్తున్నారు.

ఇప్ప‌టికే రైతుల‌పై పెద్ద ఎత్తున కేసులు, అరెస్టుల‌తో పాటు 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉద్య‌మ స‌మ‌యంలో రైతుల‌పై కంగ‌నా ర‌నౌత్ నోరు పారేసుకున్నారు.

వారిని తీవ్ర‌వాదులుగా, ఉగ్ర‌వాదులుగా, ఖ‌లీస్తాన్ మ‌ద్ద‌తుదారులుగా, వేర్పాటు వాదులుగా, దేశ ద్రోహులుగా పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు రైతులు.

తాజాగా ఢిల్లీలోని గురు ద్వారా మేనేజ్ మెంట్ క‌మిటీ ఆమెపై ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఏకంగా కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut )పై రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు లేఖ రాసింది.

భార‌త దేశంలో అత్యున్న‌త నాలుగో అవార్డుగా భావించే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరింది. ఆమె ఆ అవార్డుకు పూర్తిగా అన‌ర్హురాలంటూ తెలిపింది. ఇదిలా ఉండ‌గా రైతుల పోరాటానికి కేంద్ర స‌ర్కార్ దిగివ‌చ్చింది.

సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి మోదీ తాము సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. సిక్కు మ‌త‌స్తులు సుబ‌ర్్బ‌న్ ఖ‌న్ పోలీస్ స్టేషన్ లో కంగ‌నా పై కేసు నమోదైంది. మ‌త పెద్ద‌లు ఆమె పై ఫిర్యాదు చేశారు.

Also Read : ఆనాటి అభిమానం అలాగే ఉంది

Leave A Reply

Your Email Id will not be published!