#TamilnaduTeam : ‘టీసీఏ’ డిక్లేర్ త‌మిళ‌నాడు టీం

దినేశ్ , సుంద‌ర్ ల‌కు చాన్స్

Tamilnadu Team : ఇప్ప‌టికే స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫి ముగిసింది. త్వ‌ర‌లో విజ‌య్ హ‌జారే ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. ఇందు కోసం త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ – టీసీఏ తాజాగా 20 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును డిక్లేర్ చేసింది.

మ‌రో వైపు వికెట్ కీప‌ర్ , బ్యాట‌ర్ గా పేరొందిన దినేష్ కార్తీక్ , ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ చేతి వేలా గాయంతో మొద‌టి టెస్టుకు జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ సంద‌ర్భంగా క‌ర్నాట‌క‌తో జ‌రిగిన ఫైనల్ లో త‌మిళ‌నాడు(Tamilnadu Team) త‌ర‌పున వీరిద్ద‌రూ పాల్గొన లేదు. ఆఖ‌రు బంతిలో సిక్స్ కొట్టి షారుఖ్ ఖాన్ త‌మిళ‌నాడు జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

ఇదిలా ఉండ‌గా విజ‌య్ హ‌జారే ట్రోఫీ వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక త‌మిళ‌నాడు జ‌ట్టు (Tamilnadu Team)విజ‌యానికి వ‌స్తే ఎప్ప‌టి లాగే విజ‌య్ శంక‌ర్ కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇందులో ఎన్. జ‌గ‌దీశ‌న్, దినేష్ కార్తీక్ , సి. హ‌రి నిశాంత్ , ఎం. షారుక్ ఖాన్ , ఆర్. సాయి కిషోర్ కు చోటు ద‌క్కింది. వీరితో పాటు సందీప్ వారియ‌ర్ , ఎం.ఎస్. సుంద‌ర్ , ఎం. సిద్దార్త్ , బి. సాయి సుద‌ర్శ‌న్ , గంగా శ్రీ‌ధ‌ర్ రాజు ఉన్నారు.

ఎం. మ‌హ‌మ్మ‌ద్ , జె. కౌసిక్ , పి. శ‌ర‌వ‌ణ కుమార్ , ఎల్. సూర్య ప్ర‌కాశ్ , ఇంద్ర‌జిత్ , సంజ‌య్ యాద‌వ్ , కౌశిక్ గాంధీ, సిలంబ‌ర్సన్ ఎంపిక‌య్యారు.

ప్ర‌ధానంగా ఎంపిక చేసిన టీమ్ లో బ్యాట‌ర్లు, ఆల్ రౌండ‌ర్లు, బౌల‌ర్ల‌కు ప్ర‌యారిటీ ఇచ్చింది తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్. ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చేజిక్కించుకున్న త‌మిళ‌నాడు టీం ఫుల్ జోష్ మీదుంది.

Also Read : ద్ర‌విడ్ కు స‌ల్మాన్ భ‌ట్ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!