#TeamIndiaPractice : చెమ‌టోడ్చుతున్న భార‌త క్రికెట‌ర్లు

ప‌ర్య‌వేక్షిస్తున్న హెడ్ కోచ్ ద్ర‌విడ్

Team India Practice : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దెబ్బ‌కు భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు చెమ‌టోడ్చుతున్నారు. స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో మొద‌టి టెస్టు ఈనెల 25న కాన్పూర్ లో జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టికే ఆ జ‌ట్టు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ గా ఉంది. కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్సీలో కీవీస్ యూఏఈలో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు చేరింది. అయితే తీవ్ర గాయం కార‌ణంగా కేన్ టీ20 జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు.

విశ్రాంతి తీసుకున్న అనంత‌రం భార‌త్ తో జ‌రిగే టెస్ట్ మ్యాచ్ కు హాజ‌రవుతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్ప‌టికే వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా టీ20 సీరీస్ లో భాగంగా జ‌రిగిన మూడు మ్యాచ్ ల్లో భార‌త్ గెలుపొందింది.

కోహ్లీకి బ‌దులు కొత్త‌గా సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో టీమిండియా(Team India Practice) క్లీన్ స్విప్ చేసింది. మ‌రో వైపు ర‌వి శాస్త్రి స్థానంలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ ను బీసీసీఐ నియ‌మించింది.

కొత్త కోచ్ గా ద్ర‌విడ్ వ‌చ్చాక త‌న మార్క్ చూపించాడు. మైదానంలో ఫుల్ ప్రాక్టీస్ లో మునిగేలా చేశాడు. తానే ద‌గ్గ‌రుండి చూస్తున్నాడు. ఓ వైపు బౌలింగ్ , బ్యాటింగ్, ఫీల్డింగ్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టేలా వాళ్ల‌ను త‌యారు చేసే ప‌నిలో ఉన్నాడు ద్ర‌విడ్.

ఎలాగైనా స‌రే పోయిన ప‌రువు నిల‌బెట్టు కోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఆడాల‌ని దిశా నిర్దేశం చేస్తున్నాడు హెడ్ కోచ్. ఇక భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవ‌డంతో అత‌డి స్థానంలో అజింక్యా ర‌హానే కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది బీసీసీఐ.

దీంతో ర‌హానేతో పాటు పుజారాల ఆధ్వ‌ర్యంలో ఆట‌గాళ్లు ఫుల్ ప్రాక్టీస్ లో నిమ‌గ్నం కావ‌డం విశేషం.

Also Read : బంగ్లా క్రికెట్ బోర్డుపై ‘హ‌క్’ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!